కృష్ణ

కరవు రహితంగా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 5: కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేయాలన్నదే తన లక్ష్యమని నీటికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయటం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా ఏ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికపై ఆయా రంగాలకు చెందిన అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నీరు-ప్రగతి మన జీవితాలకు చాలా అవసరమని, నీటి సంరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దూరదృష్టితో ఆలోచించాలని, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఇంకుడు గుంటలు ప్రారంభించాలని ఎకరానికి ఒక సెంటు పోయినా ఇంకుడు గుంట ఏర్పాటుచేసుకోవాలని, లేకపోతే ఎకరాలే పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పంట సంజీవని కింద పంట ఎండిపోకూడదని, రెయిన్ గన్ ద్వారా పంటలను కాపాడుతున్నామన్నారు. కరువు మనల్ని చూసి భయపడాలని మనం భయపడకూడదన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలని, గోడౌన్లను పెంచడం జరుగుతుందన్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవసరమని, వాటిని ప్రతి ఒక్కరూ అవలంభించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు బంగారాన్నైనా పండించగలరన్నారు. రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తోటపల్లి, గాలేరు వంటి ప్రాజెక్టులను పూర్తిచేయటం జరిగిందని, కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించి పంటలను బాగా పండించాలని గ్రామం పరిశుభ్రంగా ఉంటే తద్వారా ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. తాను పేదవారికి కుటుంబ పెద్దగా ఉంటానని వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యతనివ్వటం జరుగుతుందన్నారు. పేదరికమే తన కులమని, పేదవారికి అండగా ఉంటానన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. చదువు అవసరమని, చదువుకన్నా పద్ధతులు ఇంకా అవసరమన్నారు. విశాఖపట్నంలో పరిశ్రమలున్నాయని, కృష్ణాజిల్లాలో వ్యవసాయం ఉందని రెండు జిల్లాలు తలసరి ఆదాయంలో పోటీపడుతున్నాయన్నారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలను చూసానని, 7 గంటలకు ఒక్క నిమిషం తగ్గకుండా విద్యుత్ నిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాలని, పంట యొక్క లాభ నష్టాలను తెలుసుకోవాలన్నారు. ఈపోస్ విధానం ద్వారా ఎటువంటి అవినీతి జరుగకుండా లబ్ధిదారులకు ఉపకార వేతనాలు అందేలా టెక్నాలజీని వాడుతున్నామన్నారు. వ్యవసాయంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయని, మార్పులకనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి వ్యవసాయం ఎంతో అవసరమని, మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందన్నారు. ఐదేళ్ల గ్యారంటీతో పంపుసెట్లను ఇవ్వటం జరుగుతుందని, ఈ పంపుసెట్ల ద్వారా 33 శాతం కరెంట్ పొదుపుచేసే అవకాశం ఉందన్నారు. మీ అప్పును నా భుజస్కంధాలపై పెట్టుకున్నానని, రూ.24వేల కోట్ల రుణమాఫీ భారతదేశంలో ఏపార్టీ చేయని విధంగా తెలుగుదేశం చేసిందన్నారు. చేపల, రొయ్యల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఉందని, చేపల పెంపకంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందన్నారు. వివిధ పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు బీమా అందుబాటులో ఉందన్నారు. నీటి సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రశంసించడంతోపాటు అన్ని రాష్ట్రాలు అమలుచేసేలా నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జలసంరక్షణలో భాగంగా ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకునే విధంగా ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మాంకీబాత్ కార్యక్రమంలో ప్రశంసించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా ఐదులక్షల నీటికుంటలు తవ్వాలని లక్ష్యాన్ని నిర్ణయించారన్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడుగుంట తప్పనిసరిగా ఉండాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీ్ధర్, కలెక్టర్ బాబు.ఎ., టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్ కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కార్పొరేటర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.