కృష్ణ

రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరూ శ్రమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 5: అశాస్ర్తియంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా శ్రమించాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం స్థానిక మెహర్ బాబా ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నాటి యుపిఎ ప్రభుత్వం ఎటువంటి ముందు చూపు లేకుండా అశాస్ర్తియంగా, అనైతికంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిద్రాహారాలు మాని శ్రమిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు ఇవ్వాలన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ మాత్రం బెరుకు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ పథాన పయనిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విద్యుత్ లోటును భర్తీ చేసి నిరంతర విద్యుత్ సాధించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా జరగని రుణమాఫీ మన రాష్ట్రంలో జరిగిందన్నారు. రూ.24వేల ఓకట్ల మేర రుణాలు మాఫీ చేశామన్నారు. అలాగే 43లక్షల మందికి రూ.1000, రూ.1500లు చొప్పున పెన్షన్ అందిస్తున్నామన్నారు. నదుల అనుసంధానంతో డెల్టా భూములను సస్యశ్యామలం చేశామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుకు భూసార పరీక్షలు నిర్వహణ, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసి రైతుల పక్షపాతిగా పేరుతెచ్చుకున్నట్లు చెప్పారు. బందరు పురపాలక సంఘంలో 12వేల 500 మందికి, మండలంలో 8వేల 200 మంది పెన్షన్‌లు, 17వేల 500 మంది రైతులకు రూ.24కోట్ల మేర రుణాలు మాఫీ చేశామన్నారు. గత రెండేళ్ళల్లో 3500 మందికి పెన్షన్‌లు మంజూరు చేశామన్నారు. సమావేశానంతరం 40 మంది మహిళలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా కుట్టు మిషన్‌లు పంపిణీ చేశారు. వ్యవసాయ, మత్స్య, ఉద్యానవన, ఐసిడియస్ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను మంత్రి రవీంద్ర పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరు రంగయ్య, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, ఎంపిడివో జివి సత్యనారాయణ, టిడిపి నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.