శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల మార్పుపై హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 6: నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాతో ఆదివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పలు స్టేషన్లలో ఉన్న సమస్యలను జిఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మేకపాటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళలు ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, అక్టోబర్ 1వ తేది నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళలు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని జిఎం హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గూడూరు నుంచి బయల్దేరే సమయం రాత్రి 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మార్చేందుకు ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు ప్రధాన స్టేషన్ దక్షిణం వైపు ఎకరాకు పైబడి నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని రైల్వే మల్టీకాంప్లెక్స్ కట్టిస్తే ప్రజలకు రైల్వే శాఖకు ఆదాయ వనరుగా ఉంటుందని ఎంపి ప్రతిపాదించారు. నెల్లూరు ప్రధాన స్టేషన్‌తో పాటు, దక్షిణ స్టేషన్, వేదాయపాలెం, పడుగుపాడు, కావలి, బిట్రగుంట, ఉలవపాడు స్టేషన్లలో ప్రయాణికుల వసతికై ప్రతిపాదనలు అందచేసినట్లు మేకపాటి తెలిపారు.
ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ ప్రారంభం
* తొలిరోజు 74 సర్ట్ఫికెట్ల పరిశీలన
* మొరాయించిన ఆన్‌లైన్
* విద్యార్థుల అవస్థలు
వేదాయపాళెం, జూన్ 6: ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించే కౌనె్సలింగ్‌ను సోమవారం అధికారులు ప్రారంభించారు. నెల్లూరు, వెంకటేశ్వరపురంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ కౌనె్సలింగ్ ప్రక్రియను నిర్వహించారు. మొదటి రోజు విద్యార్థుల సర్ట్ఫికెట్లను అధికారులు పరిశీలించారు. అయితే ఆన్‌లైన్ మొరాయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిలిచిన ఆన్‌లైన్ సదుపాయం సాయంత్రం 7.30 గంటలకు రావడంతో రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో పొందుపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు వేచి ఉండలేక వారు పడ్డ అవస్థలు వర్ణణాతీతం. సర్ట్ఫికెట్ల పరిశీలనలో భాగంగా మొదటిరోజు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 23 మంది, వెంకటేశ్వరపురంలోని బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 51 మంది విద్యార్థుల సర్ట్ఫికెట్లను పరిశీలించారు.
విద్యుదాఘాతానికి ఒకరు మృతి
నెల్లూరు, జూన్ 6: రోడ్డుపై నడచి వెళ్తున్న బాటసారి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు సోమవారం రాత్రి నగరంలో తీవ్రగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలుల దాటికి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ట్రాన్స్‌కో విద్యుత్ లైను తీగ తెగి రోడ్డుపై పడింది. రోడ్డుపై ఉన్న వర్షపునీటిలో ఈ తీగ పడడం ఎవరూ గమనించలేదు. ఆ దారి వెంబడి నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి ఆ నీటిలో అడుగు వేయడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్యవయస్సు ఉంటుంది. మృతుని పూర్తి వివరాలు తెలియలేదు. నాలుగో నగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరులో గాలివాన బీభత్సం
నెల్లూరు, జూన్ 6: నెల్లూరు నగరంలో సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలల ధాటికి నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు విద్యుత్ పునరుద్ధరించలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో విద్యుత్ లైన్ తీగలు తెగి నేలమీద వర్షపు నీటిలో పడడంతో ఆ దారిన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈదురు గాలులతో పాటు వర్షం కురవడంతో వేదాయపాళెం, నిప్పో సెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్, బొల్లినేని ఆసుపత్రి, రామలింగాపురం తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.