శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కోవూరు పరిధిలో వ్యక్తి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 7: ఇష్టారీతిగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ తనపై పనిచేసే వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేసిన ఘటన కోవూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు కోవూరు పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఓ హోటల్‌లో ఇస్మాయిల్ (32) చీఫ్ వంటమాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతనిది చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం. తన కింద పనిచేసే సిబ్బంది పట్ల ఇస్మాయిల్ తరచూ దురుసుగా ప్రవర్తించేవాడు. అదేవిధంగా టిపి గూడూరు మండలం ఈదూరు గ్రామానికి చెందిన చెంగల్రాయుడు అనే వ్యక్తి అదే హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఇస్మాయిల్ తరచూ చెంగల్రాయుడిని ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించిన ఇస్మాయిల్ చెంగల్రాయుడిని, అతని కుమార్తె గురించి అసభ్యంగా మాట్లాడుతూ వేధించాడు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో కోపోద్రిక్తుడయిన చెంగల్రాయుడు తన వద్దనున్న ఇనుప సుత్తితో ఇస్మాయిల్ తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. ఈ గాయాలకు ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు కోవూరు సిఐ మాధవరావు కేసు దర్యాప్తుచేస్తున్నారు.