శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అన్ని గ్రామాలకూ బస్సు సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 7: రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు అన్ని బస్టాండ్లలో సౌకర్యాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు భవనాలు, రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా మంగళవారం కోవూరులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 19 ఓడరేవుల నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా తమ ప్రభుత్వం డిజైన్లు రూపకల్పన చేస్తోందని అన్నారు. జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుతోపాటు దుగరాజుపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రాజెక్టుల పేరుతో నిధులు దుర్వినియోగం అయ్యాయని తమ ప్రభుత్వం అవినీతి రహతంగా యుద్ధప్రాతిపదికన అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలిపారు. ఈసమావేశంలో కోవూరు శాసనసభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జెడ్పీటిసి సభ్యులు వెంకటేశ్వర్లురెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ రామిరెడ్డి పాల్గొన్నారు.