శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జూన్ 7: తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయకపోతే ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు పవన్‌తేజ డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విద్యార్థులకు ఎన్నికలలో ఇచ్చిన 34 వాగ్దానాల అమలు కోసం ఎన్‌ఎస్‌యుఐ పోరుబాట పడుతుందన్నారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం విషయంలో మొద్దు నిద్ర పోతోందని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరించడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎపి పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయిలో తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు విద్యార్థులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు విద్యాసంస్థల్లో ఫ్రీ వైఫై, ఉచిత ల్యాప్‌టాప్‌లు, ఉచిత బస్‌పాస్‌ల హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌లో సరైన వసతులు లేక సర్వర్లు పనిచేయక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌనె్సలింగ్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినందున వసతిగృహాలలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని, ప్రభుత్వ వసతిగృహాలలో సన్న బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిఆర్‌ఓకు వినతిపత్రం అందచేశారు. ఈ సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉడతా వెంకట్రావు, జిల్లా ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు జి కేశవనారాయణ, నగర అధ్యక్షుడు ముమిత్‌షా, బిసి సెల్ రాష్ట్ర కన్వీనర్ శివాచారి, ఆసిఫ్‌బాషా, డిసిసి ప్రధాన కార్యదర్శి బాలసుధాకర్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి బాలకృష్ణ పాల్గొన్నారు.