ప్రకాశం

జగన్‌తో బాలినేని భేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 7: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాజీ మంత్రి, ఒంగోలు మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసులురెడ్డి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మంగళవారం భేటి అయ్యారు. వీరిద్దరి సమావేశంలో జిల్లాపార్టీఅధ్యక్ష బాధ్యతలపై చర్చ నడిచింది. జిల్లాపార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలని జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డికి సూచించటం జరిగింది. దీంతో జగన్ సూచనకు బాలినేని సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ మేరకు మరో రెండు,మూడురోజుల్లో జగన్ బాలినేని పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. సోమవారం బాలినేని నూతనోత్సహంతో ఒంగోలుకు రానున్నారు. ఆ మేరకు ఆయన అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన వైకాపా శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్‌రాజు, ముత్తుమల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్ పార్టీని వీడటంతో ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జి బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న చర్చ కూడా వారిద్దరి మధ్య నడిచినట్లు సమాచారం. ముందుగా గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయికల్పనారెడ్డి లేదా ఆమెకుమారుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఆమేరకు సాయికల్పనారెడ్డి పేరు వీరిద్దరి మధ్య ప్రముఖంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. గిద్దలూరు నియోజకవర్గంలో పిడతల కుటుంబానికి మంచిపట్టుఉండటంతో ఆ మేరకు జగన్ ఆమె పేరును తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో త్వరలోనే ఇన్‌చార్జులను నియమించే అవకాశాలున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో త్రిమెన్‌కమిటీని నియమిస్తారా లేక ఒకరినే ప్రకటిస్తారా అన్న చర్చ పార్టీశ్రేణుల నుండి వినిపిస్తొంది. అదేవిధంగా త్వరలో ఒంగోలునగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఒంగోలునగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు బాలినేని కసరత్తులు చేసే అవకాశాలున్నాయి. మొత్తంమీద మరో రెండు,మూడురోజుల్లో అధికారికంగా బాలినేనిని జిల్లా అధ్యక్షుడిగా జగన్ ప్రకటించనున్నారు. ఈ వార్తతో బాలినేని అభిమానుల్లో ఆనందోత్సవాలు వెల్లువిరిస్తున్నాయి.