ప్రకాశం

గ్రామీణ ప్రాంత్రపజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 7 : జిల్లాలో పేదరికం, కరవు పరిస్థితుల్లో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోవడంతో పాటు వారి జీవనప్రమాణాలు పెంపొందించేందుకు అధ్యయనం చేయడానికి కృషి చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ అంతర్జాతీయ సంస్థ ఐఫాడ్ ప్రతినిధి ఫ్రాన్స్‌కు చెందిన హెలెన్ తెలిపారు. మంగళవారం ఉదయం ఐఫాడ్ సంస్థ ప్రతినిధులు లైవ్‌స్టాక్ స్పెషలిస్ట్ హెలెన్, ఎకనామిస్ట్ పూజ, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఫాడ్ సంస్థ ప్రతినిధులు దోర్నాల మండల పెద్ద బొమ్మలాపురంలో దానిమ్మ, అరటి, బొప్పాయి తోటలు పరిశీలించామని, ఉద్యాన పంటలు వేసుకున్న రైతులతో మాట్లాడి, నీటి సంరక్షణా కార్యక్రమాలపై అధ్యయనం చేసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌కు వివరించారు. అదేవిధంగా సంతనూతలపాడు మండలంలో గొర్రెల పెంపకందారుల కో-ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులతో గొర్రె పెంపకం, గొర్రెలవృద్ధి, పోషణ గురించి వివరాలు సేకరించామని తెలుపుతూ సొసైటీ సభ్యులు గొర్రెల షెల్టర్ అవసరం ఉందని తమకు తెలియజేశారని ఇన్‌చార్జి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పశ్చిమప్రాంతంలో వరితో పాటు ఉద్యాన పంటలు వర్షపు నీటి ఆధారంతో వ్యవసాయం చేస్తున్నారని ఐఫాడ్ సంస్థ ప్రతినిధులకు తెలిపారు. ఈ ప్రాంతంలో చెక్‌డ్యామ్‌లు, నీటి సంరక్షణా కార్యక్రమాలు, సేద్యపు కుంటలు ఏర్పాటుతో పంటలకు నీటి కొరత రాకుండా వ్యవసాయం చేసుకునేలా రైతులలో అవగాహన కల్పిస్తున్నామని, కెపాసిటీ బిల్డింగ్ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలైన ఉద్యాన,మత్య్స శాఖలలో అత్యధిక ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో నీటి కొరత ను అధిగమించడానికి ప్రతి రైతు ప్రతి ఐదు ఎకరాలకు ఒక సేద్యపు కుంటను నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని , ఆదిశగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. అదే విధంగా గ్రామీణప్రాంతాల్లో వర్మికంపోస్టు , పశుగ్రాసంపెంచడానికి ప్రజలలో అవగాహన పెంపొందిస్తున్నామన్నారు. సేద్యపు నీటి కుంటల నిర్మాణాల సైజుల వివరాలను ఐఫాడ్ ప్రతినిధులు ఇన్‌చార్జి కలెక్టర్‌ను అడిగితెలుసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలో బత్తాయి పెంపకం ద్వారా రైతులు అధిక లాభాలు పొందుతున్నారని,గత రెండు సంవత్సరాల నుండి వర్షాభావ పరిస్థితుల వలన బోరు బావులు ఎండిపోవుట వలన బత్తాయి తోటలన్నీ దెబ్బతిని రైతులు నష్టపోయారని ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతినిధులకు వివరించారు.
జిల్లాలో వరి, పొగాకు, శనగలు ఎక్కువగా పండిస్తున్నారని, అలాగే పదివేల ఎకరాలల్లో మరింత మామిడి తోటలు పెంచుతున్నారని ఆయన విరించారు.జిల్లాలో ఐఫాడ్ సంస్థ ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు, గొర్రెల షెల్టర్స్ ఏర్పాటుకు సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ అనుబంధ రంగాలలో నైపుణ్యత కలిగి శిక్షణ వంటి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని ఆయన కోరారు. జిల్లాలో ఉప్పునీటి చెరువులలో పెద్ద ఎత్తున రొయ్యల సాగు చేపడుతున్నామని, విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతినిధులకు తెలిపారు. జిల్లాలో డెయిరీ,్ఫషరీస్, ఉద్యాన శాఖల ద్వారా అత్యధిక ఆదాయ మార్గాలున్నాయన్నారు. ఐఫాడ్ ప్రతినిధులు పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ రజనీ కుమారితో మాట్లాడారు. జిల్లాలో గొర్రెలు, మేకల సంఖ్య వాటి పోషణ పై అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పశు పోషకుల స్థితి గతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గొర్రెల బ్రీడింగ్ రేషియో, మార్కెటింగ్ అవకాశాలు ఏలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన శాఖ అధికారి పావని పొదిలి, కురిచేడు, దర్శి ప్రాంతాల్లో వర్షాభావంతో చేపట్టిన దానిమ్మ పంటలు విస్తీర్ణం, రైతులు స్థితి గతులు ఆదాయ వనరులపై ఐఫాడ్ ప్రతినిధులకు వివరించారు. ప్రధానంగా రైతులు పండ్ల తోటల పెంపకంకు సంబంధించి ఫెన్సింగ్, నెట్టింగ్ వంటి అందజేయాలని కోరినట్లు తెలిపారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ గొర్రెల పెంపకందారులకు విలువ ఆధారిత ఆదాయం రావడం లేదని, అలాగే పెంపకం దారులకు బ్యాంకులద్వారా రుణాలు అందించి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చవలసి ఉంటుందని ఆయన ప్రతినిధులకు తెలిపారు. జిల్లాలో రైతులు ఇప్పటికీ పలు ప్రాంతాల్లో సాంప్రదాయపద్దతిలోనేవ్యవసాయం చేస్తున్నారని , ఆధునిక వ్యవసాయపరిజ్ఞానాన్ని అందించాల్సి ఉందని ఆదిశగా వారిలో అవగాహన కల్పించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జె మురళీక్రిష్ణ, డిడి వై వి మురళీక్రిష్ణ, ఏడి షాజహాన్, పశు సంవర్థక శాఖ ఏడిడాక్టర్ రవి పాల్గొన్నారు.