ఆంధ్రప్రదేశ్‌

బతుకు బస్టాండే! (తరలింపు తిప్పలు - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 7: రాష్ట్ర విభజన కార్చిచ్చు ప్రభుత్వోద్యోగుల మెడకు పామైచుట్టుకుంది. ఉద్యోగుల సంసారాలను నిలువునా చీల్చేసింది. విభజన తరువాత కొత్త రాజధాని ఎక్కడ ఏర్పడితే అక్కడికి తరలి వెళ్లిపోవాలన్న విషయం ఉద్యోగులకు తెలియంది కాదు. ఇందుకు చాలామంది ఉద్యోగులు మానసికంగా సిద్ధపడ్డారు కూడా. కాకపోతే దాని తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తరలింపు వ్యవహారం కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితిని తెస్తోంది. అలాగే అధికారుల మధ్య సమన్వం లేకపోవడం, ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలైనా స్థానికత అంశం తేలకపోవడంతో తరలిరావల్సిన ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగుల్లో భర్తలవి సర్కారు కొలువులైతే, భార్యలు, వారి పిల్లలు ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నారు. భార్యది ప్రభుత్వోద్యోగమైతే, భర్త ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న కుటుంబాలూ ఉన్నాయి. కొంతమంది స్థానిక సంస్థల్లో పని చేస్తున్నారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారిలో భార్య, భర్తల్లో ఎవరైనా అక్కడే ప్రభుత్వోద్యోగం చేస్తుంటే, వారిద్దరిని తెలంగాణలోనే కొనసాగించేలా టి.ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఏపీకి తరలివచ్చే ఉద్యోగులకు ఆ సౌకర్యం లేకుండా పోయింది. ఉదాహరణకు భర్త ఏపీ సెక్రటేరియట్ లేదా డైరక్టరేట్ లేదా కమిషనరేట్‌లో పని చేస్తున్నారని అనుకుందాం. ఆయన భార్య ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంటే, పిల్లలు తెలంగాణ ప్రభుత్వంలోని కమిషనరేట్, డైరక్టరేట్లలో అసిస్టెంటెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు భర్త రాజధాని అమరావతికి రావల్సి ఉంది. దీంతో భార్య కూడా ఆమె ఉద్యోగాన్ని వదులుకుని భర్తవెంట రావల్సి వస్తోంది. మరి పిల్లల మాటేంటి? దీనిపై ఇరు ప్రభుత్వాల నుంచి సమాధానం లేదు. తామంతా హైదరాబాద్‌లోనే సెటిలవుతామన్న ఉద్దేశంతో భార్యా భర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చారు. ఈ తరలింపు వలన ఎవరో ఒకరు ఉద్యోగం వదులుకోక తప్పదు. ఒకవేళ వీరిలో ఏ ఒక్కరైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో హైదరాబాద్‌లో పనిచేస్తే, ఇద్దరూ వేర్వేరుగా జీవనాన్ని సాగించాల్సిందే.
స్థానికతపై తాత్సారమెందుకు?
స్థానికత అంశంపై ఉద్యోగుల్లో నెలకొన్న భయాందోళనలు పోగొట్టేందుకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. స్థానితకమీద ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడం లేదో అర్థంకావడం లేదు. తండ్రి స్థానికతకు సంబంధించి విభజన చట్టంలోని సెక్షన్ 371 (డి)లో చిన్నపాటి చేర్పులు చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సవరణలను కేంద్రానికి పంపించింది. దానిపై కేంద్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చి తిరిగి కేంద్రానికి పంపించింది. ఈ ప్రక్రియ పూరై రెండు నెలలైంది. అయినా కేంద్రం స్పందించకపోవడం పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంసెట్ కౌన్సిలింగ్ ఆరంభమైంది. ఉద్యోగులు ఏపీకి తరలి వచ్చాక స్థానికతపై స్పష్టత వచ్చినా ప్రయోజనం ఉండదని ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు. ప్రస్తుతం సంకట పరిస్థితుల్లో తమ పిల్లలు ఎక్కడ లోకల్ అవుతారు? ఎక్కడ నాన్ లోకల్ అవుతారన్న విషయం తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల పిల్లలు కూడా ఇదే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. తమ పిల్లల భవిష్యత్‌తో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారెందుకు?
ఉద్యోగులకు, పాలకులకు మధ్య సమన్వయం లేకపోవడం వలన తరలింపు ప్రక్రియ జటిలంగా మారుతోంది. తాత్కాలిక సెక్రటేరియట్‌లో జి ప్లస్ త్రి అంతస్తులు నిర్మిస్తామన్నాను. జూన్ 15నాటికి ఉద్యోగులు తరలి రావాలన్నారు. ఇప్పుడు తాత్కాలిక సెక్రటేరియట్‌లో అంతస్తులను కుదించారు. హెచ్‌ఓడిలను ప్రైవేటు భవనాలు వెతుక్కోమన్నారు. అలాగే ఏ శాఖ ఎప్పుడు తరిలి వెళ్లాలి? సెక్రటేరియట్ ఉద్యోగులు ఎప్పుడు వెళ్లాలి తదితర అంశాల మీద ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల ఆందోళనకు ఇదే ప్రధాన కారణమని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగులు, ఉన్నతాధికారులు, పాలకుల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమని అంటున్నారు.
ఏదీ మంత్రుల జోక్యం?
తమతమ శాఖలను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించే విషయంలో మంత్రులు జోక్యం చేసుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మంత్రులే స్వయంగా విజయవాడలో కూర్చుని కార్యాలయాలకు కావల్సిన భవనాలను చూస్తే, ఈపాటికి హెచ్‌ఓడిలన్నీ అక్కడికి వచ్చేవని సంఘ నేతలు అంటున్నారు. సిఎం ఆశయాన్ని మంత్రులు పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
నలిగిపోతున్న నేతలు
ఉద్యోగులు తరలింపు అంశం అనేక మలుపులు తిరగడంతో ఉద్యోగ సంఘ నేతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అధినాయకులు చంద్రబాబు నుంచి మంచి మార్కులు కొట్టేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు వీరికి నచ్చచెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

చిత్రం... తాత్కాలిక సచివాలయం వద్ద ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన మహిళా సిబ్బంది (ఫైల్)