ప్రకాశం

వైద్యుడు రత్నంపై నిర్భయ కేసు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జూన్ 9: మహిళా హౌస్‌సర్జన్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఒంగోలు రిమ్స్ డాక్టర్ బంకా రత్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ చీరాల డివిజన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక గడియార స్తంభం సెంటరులో గురువారం వైద్యుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జి ఆదిత్య, జి ఏసుబాబు మాట్లాడుతూ ప్రజలకు వైద్యం అందించాల్సిన వైద్యుడే ఇటువంటి ఘటనలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు నాగమణిబాబు, అనీల్, అభిరామ్, రాబర్ట్, శ్రీను పాల్గొన్నారు.