ప్రకాశం

తుని సంఘటనలో బాధితులను విడిపించాలని అడగటం ముద్రగడకు సమంజసమా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపా దిద్దుబాటు చర్యలు
* నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి
ఇన్‌చార్జుల నియామకం
* అద్దంకి ఇన్‌చార్జిగా గరటయ్య
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,జూన్ 9: జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగా జిల్లారాజకీయాలకు కేంద్రబిందువైన అద్దంకి నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిగా బాచిన చెంచుగరటయ్య నియమించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఆ మేరకు ఆయన పేరును జగన్ అధికారికంగా ప్రకటించటమే తరువాయిగా మిగిలినట్లు ఉన్నతస్థాయి వర్గాల ద్వారా సమాచారం. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పిడతల సాయికల్పనారెడ్డి లేదా ఆమె కుమారుడు అభిషేక్‌రెడ్డి పేరును అధిష్టానవర్గం ప్రకటించనుంది. సాయికల్పనారెడ్డి ఇన్‌చార్జిగా ఉంటానంటే ఆమెను అధిష్టానవర్గం ప్రకటించనుంది. కాదు తన కుమారుడిని ఇన్‌చార్జిగా నియమిస్తానంటే ఆమె కోరిక మేరకు ఆయనే్న నియమించే అవకాశం ఉంది. దీంతో పిడతల కుటుంబానికి మళ్లీ రాజకీయంగా గిద్దలూరు నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తెరపైకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కందుకూరు నియోజకవర్గంనుండి మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి పేరుతెరపైకి వస్తుంది. మానుగుంటను అధికారికంగా వైకాపాలో చేర్చుకుని ఆ తరువాత ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారా అన్న వ్యాఖ్య పార్టీశ్రేణుల నుండి వినిపిస్తోంది. యర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రస్తుత వైకాపాకు చెందిన సంతనూతలపాడు నియోజకవర్గ సిట్టింగ్ శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ పేరు వినిపిస్తోంది. దీంతో నియోజకవర్గాల వారీగా వైకాపా అధిష్టానం వద్ద నాయకుల జాబితా పేర్లు ఉన్నాయి.
ఇదిఇలాఉండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున అద్దంకి నియోజకవర్గంనుండి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకోవటంతో ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చుక్కాని లేనినావలా తయారైంది. ఈ దశలో ఈ నియోజకవర్గం నుండి త్రిమెన్ కమిటీని నియమించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ త్రిమెన్ కమిటీలో బాచిన చెంచుగరటయ్య, బాదం మాధవరెడ్డి, చుండూరి రవిబాబు పేర్లు ఉంటాయని అందరు భావించారు. కాని త్రిమెన్‌కమిటీని నియమిస్తే ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తూ పార్టీకి పెద్దగా లాభం చేకూరదన్న అభిప్రాయానికి రాష్టప్రార్టీ వచ్చి గరటయ్య పేరును తెరపైకి తీసుకువచ్చారు. దీంతో గరటయ్యను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అద్దంకి నియోజకవర్గంలో కరణం, గొట్టిపాటి వర్గీయులను సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడు గరటయ్య అనే అభిప్రాయానికి వచ్చిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో గరటయ్య అద్దంకి నియోజకవర్గంనుండి శాసనసభ్యునిగా గెలుపొంది ప్రతిఒక్క నాయకుడి, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను వైకాపాతరుపున అద్దంకి నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు పావులు కదిపినప్పటికి అధిష్టానం రవికే టిక్కెట్ కేటాయించింది. తీరా రవి సైకిల్ ఎక్కటంతో గరటయ్య సేవలు పార్టీకి అవసరం అయ్యాయనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో రవిగెలుపుకు గరటయ్య విశేషకృషిచేశారన్న ప్లస్‌పాయింట్‌కూడా అధిష్టానంవద్ద ఉంది. మొత్తంమీద అద్దంకి నియోజకవర్గంలో రాజకీయంగా గరటయ్య నియామకంతో పూర్తిస్థాయిలో వేడెక్కనుందనే చెప్పవచ్చు. ఇప్పటికైనా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్టప్రార్టీ నాలుగు నియోజకవర్గాలకు సమర్థవంతమైన నాయకులను ఇన్‌చార్జులుగా నియమించాలని లేని పక్షంలో పార్టీపరిస్థితి మరింతగా దిగజారే అవకాశాలున్నాయన్నాని ఆ పార్టీకి చెందిన మేధావి వర్గం అభిప్రాయపడుతుంది.
ఒంగోలు, జూన్ 9 : గత తుని సంఘటనలో పాల్గొన్న నిందితులు, నేరస్థులను, శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని విడిపించమని ముద్రగడ పద్మనాభం అడగటం సమంజసమా అని కాపుకార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామాంజయ్య అన్నారు. గురువారం ఉదయం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుని ఘటనలో నేరస్థులుగా పరిగణింపబడిన వారిపై కేసులు ఎత్తి వేయమని కోరడం ఎంత వరకు సమంజసం అని తెలుపుతూ ముద్రగడ పద్మనాధం గతంలో శాసన సభ్యునిగా,పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా పని చేశారని, నిందితులపై గల కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేయడం పౌరులకు ఎలా భద్రత ఉంటుందన్నారు. ఈ రకమైన కోరికను హింసను ప్రేరేపించినట్లు కాదా, చట్టాన్ని వ్యతిరేకించినట్లు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వలన రాష్ట్రం చాలా నష్ట పోయిందని, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, విదేశాల నుండి అనేక పారిశ్రామిక వేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రలు సరిగ్గా ఉంటేనే అన్నీ రకాల వసతులు సమకూర్చుకునే అవకాశం ఉందన్నారు. ముద్రగడ పద్మనాభం అడిగే కోరికలు అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా ఉందన్నారు. 238 కాపు సంఘాలతో కాపుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందని, ఆయా సంఘాలతో ఎప్పుడైనా ముద్రగడ మాట్లాడారా, అదేవిధంగా మంజునాధ కమీషన్‌ను కలిశారా, రాష్ట్రంలో గల కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలను కలిసి సంప్రదించారా అని ఇ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ముద్రగడ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటూ అధోగతి పాలు చేయాలని ప్రతిపక్ష నేతతో చేతులు కలపడం సమంజసమా అంటూ కాపు ముసుగులో ఉండి పోరాటం సాగించి అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారన్నారు. రాజకీయ అజెండాతో ఆయన వ్యక్తిగత లబ్థి కోసం పోరాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి కృషి చేస్తున్నారని వారికి అండగా నిలవాలన్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేతిలో కీలు బొమ్మగా మారి ముద్రగడ మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేలా కార్యక్రమాలు చేపట్టారని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. కాపులకు, బలిజలకు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు కాపు రాష్ట్ర అధ్యక్షులు చింతం సుబ్బారావు, ట్రెజరర్ పోతంశెట్టి దుర్గా ప్రసాద్, ఉపాధ్యక్షులు తోట రామారావు తదితరులు ఉన్నారు.