శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రెండేళ్ల బాబు పాలన సున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 9: గడచిన రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో సగటు ప్రజానీకానికి ఒరిగిందేమీ లేదని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి విమర్శించారు. గురువారం ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు, నువ్వూరుపాడు గ్రామాలతో సహా పురపాలక సంఘ పరిధిలోకి వచ్చే నరసాపురంల్లో ఆయన జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎనె్నన్నో హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కాక వాటిని సజావుగా అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారని తప్పుబట్టారు. రుణమాఫీపై బాబు తొలి సంతకం చేయగా, ఆ ప్రక్రియ నేటికీ ఓ కొలిక్కి రాలేదన్నారు. ఎన్నికల ప్రచారంలోనే రుణమాఫీ అసాధ్యమని తమ నేత జగన్ స్పష్టం చేశారన్నారు. అదే బాబు మాదిరి కల్లబొల్లి మాటలు చెప్పి ఉంటే వైఎస్‌ఆర్‌సిపినే అధికారంలోకి వచ్చేదన్నారు. కాగా, ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట నీటి పథకాల ఏర్పాటుపరంగా కూడా అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మిషనరీ ఎవరైనా దాత ద్వారా సమకూర్చుకోవాలన్నారు. అలాగే భవన సదుపాయం కోసం స్థానిక సంస్థల నుంచి సహాయం పొందాల్సి ఉందన్నారు. ఇవన్నీ తోడవ్వడం కష్టతరమై ఎన్టీఆర్ సుజల స్రవంతి విజయపథాన కొనసాగలేకుందన్నారు. తనకొచ్చే ఎంపి ల్యాడ్స్ నుంచే ఇబ్బడిముబ్బడిగా జనం కోరిన చోటల్లా శుద్ధిచేసిన నీటి పథకం ప్లాంట్లను నెలకొల్పేలా సహకరిస్తున్నట్లు చెప్పారు. ఇదిలాఉంటే ఎలాంటి సౌకర్యాల్నీ సమకూర్చకనే సచివాలయ ఉద్యోగుల్ని హైదరాబాద్ వీడి అమరావతికి తరలిరావాలనే ముఖ్యమంత్రి ఒత్తిళ్లు విడ్డూరమన్నారు. మొత్తం దశాబ్ధ కాలంపాటు హైదరాబాద్‌పై ఆంధ్రాకు కూడా తెలంగాణాతోపాటు సమ హక్కు ఉందన్నారు. అయితే ఇంకా ఎనిమిది సంవత్సరాల గడువు ఉన్నప్పటికీ ఆఘమేఘాలపై హైదరాబాద్ ఖాళీ చేయాల్సిన అగత్యం వెనుక కారణం ఏమిటో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణాలో గత ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటుకు నోటు వ్యవహారమే అకస్మాత్తుగా అమరావతికి తరలిపోవాలనే బలమైన కారణానికి పునాదిగా మేకపాటి అభిప్రాయపడ్డారు. ఇంతేగాక ఇటీవల రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను కూడా హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో చేపట్టాలని భావించారన్నారు. తద్వారా దొడ్డిదారిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలను కరెన్సీ కట్టలతో ప్రలోభపరచుకుని స్వతంత్రునిగా తెలుగుదేశం మద్దతుదారుడిని బరిలో నిలిపి అడ్డగోలుగా గెలుపొందాలని కుయుక్తి పన్నారన్నారు. అయితే ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నిక ప్రక్రియ హైదరాబాద్‌లోనే చేపట్టాలని హుకుం జారీ చేసిందన్నారు. తెలంగాణా పోలీస్ యంత్రాంగం ఉండేచోట బాబు కోటరీ తోక ముడవాల్సి వచ్చిందనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఏదేమైనా రానున్న మరో మూడేళ్ల బాబు పరిపాలన ప్రజాహితం కాంక్షిస్తూ కొనసాగాలని ఎంపి మేకపాటి హితవు పలికారు.