ప్రకాశం

ఒంగోలులో ప్రారంభమైన ఎస్‌డబ్ల్యుఎఫ్ 10వ రాష్టమ్రహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 10: ఒంగోలు నగరంలోని పర్సా సత్యనారాయణ నగర్ (కాపుకల్యాణమండపం)లో ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర పదవ మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సిఐటియు రాష్ట్రప్రధానకార్యదర్శి ఎంఎ గఫూర్ ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్టమ్రహాసభలను ప్రారంభించారు. తొలుత ఎస్‌డబ్ల్యుఎఫ్ మాజీ నాయకులు వెంకట్రావు జెండా ఆవిష్కరణ చేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర పదవమహాసభలు ఒంగోలునగరంలోని కాపుకల్యాణమండపంలో ఈనెల 10,11తేదీల్లో జరుగుతుండగా ఆ మేరకు శుక్రవారం నాడు సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిఐటియురాష్ట్ర ప్రధానకార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ఒకదానిపై మరోకటి పోటీపడి కార్మిక చట్టాలను మార్పులు చేస్తుందని, మార్పులు యజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయని, కార్మికులకు నష్టదాయకంగా ఈ మార్పులు ఉన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్‌టిసి నష్టాలకు కారణమైన కేంద్ర,రాష్ట్రప్రభుత్వవిధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్‌టిసి ప్రభుత్వవిధానాల కారణంగానే అప్పుల ఊబిలోకి వెళ్ళిందన్నారు. కేంద్రప్రభుత్వం పర్మిట్‌రాజ్‌విధానం తొలగింపుపేరుతో అడిగిన వారికి ఏవరికైనా స్టేజ్ క్యారేజ్ రూట్లు కేటాయిస్తామని కేంద్ర ఆర్ధికశాఖమంత్రి బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడటం చూస్తుంటే ఎన్నడూలేని విధంగా ఆర్‌టిసి రూట్లల్లో ప్రైవేటు బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆర్‌టిసిలో 2001లో 24రోజులు సమ్మె తరహాలో ప్రజలను కలుపుకుని మరోక ఐక్య ఉద్యమం చేయాలని అన్ని సంఘాల ఐక్యంగా ఒకేవేదికపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎస్‌డబ్ల్యుఎఫ్ గౌరవాధ్యక్షుడు ఆర్ లక్ష్మయ్య మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఆర్‌టిసిని ఆదుకుంటామని ఎన్నికల ముందు అనేక వాగ్ధానాలు చేసిన చంద్రబాబునాయుడు ఎన్నికల అనంతరం మాటమార్చి ఆర్‌టిసి కార్మికులు అందరు త్యాగాలు చేయాలని మాట్లాడటం బాధాకరమన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆర్‌టిఎస్ 2015బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే ఆర్‌టిసి నిర్వీర్యం అవుతుందని తెలిపారు. ప్రకాశం రీజయన్ మేనేజరు కె ఆదాయంసాహేబ్, డిప్యూటీ మెకానికల్ ఇంజనీరు రవికాంత్, ఎస్‌డబ్యుఎఫ్ రాష్టక్రార్యదర్శులు సిహెచ్ సుందరయ్య, ఎం అయ్యపరెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కె జిలానీభాషా, డిప్యూటీ జనరల్ సెక్రటరి కట్టా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని మాట్లాడారు.