ప్రకాశం

29 కేసుల్లో 10మంది నిందితులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 10:జిల్లాలోని ఒంగోలు,చీరాల,కందుకూరు, దర్శి సబ్‌డివిజన్ పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన 29కేసుల్లో పదిమంది నిందితులను అరెస్టుచేసి వారివద్ద నుండి సుమారు 25.60లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ వెల్లడించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరిగిన 29కేసుల్లో పదిమంది నిందితులను అరెస్ట్ చేసి 636గ్రాముల బంగారం, నాలుగు మోటారుసైకిళ్లు, ఆరు ట్రాక్టర్ ట్రక్కులు, ఒకలక్షా 65వేల రూపాయల నగదును మొత్తం కలిపి 25.65లక్షల రూపాయల విలువైన చోరీసొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆయా కేసుల పూర్వపరాలను ఎస్‌పి వెల్లడించారు. జిల్లాలో పలు ఇంటి నేరాలకు పాల్పడిన దొంగలను దర్శి డిఎస్‌పి రాంబాబు ఆధ్వర్యంలో ఇద్దరు నిందితులను దర్శి పోలీసులు శుక్రవారం అరెస్టుచేయటం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిమండలం సలకనూలత గ్రామానికి చెందిన పెద్దినేని తిరుపతిస్వామి, ప్రకాశం జిల్లా పొదిలి మండలం, గ్రామానికి చెందిన కామినేని మాలకొండారెడ్డిలను అరెస్టుచేసి వారి వద్దనుండి వందగ్రాముల బరువైన బంగారు వస్తువులను, నాలుగు మోటారుసైకిళ్లు, ఒక లక్షా 50వేలరూపాయల నగదును మొత్తం కలిపి ఆరులక్షల రూపాయలు విలువైనటువంటి చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ నిందితుడులు చీమకుర్తి పోలీసుస్టేషన్ పరిధిలోను, ముండ్లమూరు పోలీసుస్టేషన్‌పరిధిలో,త్రిపురాంతకం పోలీసుస్టేషన్ పరిధిలో, కురిచేడు పోలీసుస్టేషన్‌పరిధిలో ఇంటి దొంగతనాలకు పాల్పడటంతో ఈ కేసులను దర్శి డిఎస్‌పి రాంబాబు ఆధ్వర్యంలో దర్శి సిఐ, కురిచేడు, ముండ్లమూరు ఎస్‌ఐలు,కానిస్టేబుళ్లు వసంత్ తదితర సిబ్బంది ఛేదించినట్లు చెప్పారు. మరోకేసు వివరాలను ఎస్‌పి తెలియచేస్తూ ఒంగోలు పట్టణం కేశవస్వామిపేటకు చెందిన కొమ్మూరి శరత్‌ను ఒంగోలు పట్టణ డిఎస్‌పి జి శ్రీనివాసరావు, ఒంగోలు తాలుకాపోలీసుస్టేషన్ సిఐ అంటోనిరాజ్, సిసిఎస్ సిబ్బంది అరెస్టుచేసి నిందితుల నుండి సుమారు మూడులక్షల 55వేల రూపాయల విలువైన 150గ్రాములు బంగారాన్ని పోలీసులసు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒంగోలు తాలుకా పోలీసుస్టేషన్‌పరిధిలో దొంగతనాలకు నిందితుడు పాల్పడినట్లు తెలిపారు. ఈకేసును ఛేదించిన ఒంగోలు పట్టణ డిఎస్‌పి, తాలుకా సిఐ ఆంటోనిరాజ్ తదితర సిబ్బందిని ఎస్‌పి అభినందించారు. అదేవిధంగా మరోక కేసు వివరాలను ఎస్‌పి తెలియచేస్తూ చీరాల పోలీసుస్టేషన్ పరిధిలోని ఈపూరుపాలెంకు చెందిన కర్రెద్దుల ఎడుకొండలు అనే నిందితుడిని అరెస్టుచేసి ఆయన వద్దనుండి నాలుగు లక్షల 90వేల రూపాయల విలువైన 196గ్రాముల బంగారువస్తువులను చీరాల డిఎస్‌పి ప్రేమ్‌కాజల్, చీరాల రూరల్ సిఐ, కారంచేడు ఎస్‌ఐతోపాటు సిబ్బంది శుక్రవారం నిందితుడిని అరెస్టుచేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు వేటపాలెం పోలీసుస్టేషన్ పరిధిలోను, పర్చూరు, కారంచేడు పోలీసుస్టేషన్ పరిధిలో ఇంటిదొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈకేసును ఛేదించిన పైపోలీసుసిబ్బందిని ఎస్‌పి అభినందించారు. అదే విధంగా మరోకేసు వివరాలను ఆయన వివరిస్తూ సంతనూతలపాడు మండలంలోని కొప్పిట్లవారిపాలెం గ్రామానికి చెందిన రాపూరి అలియాస్ పొట్లూరి నాగరాజు అనే నిందితునితో పాటు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జోరుడుపల్లి గ్రామానికి చెందిన గోగుల లక్ష్మయ్యతోపాటు అదే గ్రామానికి చెందిన గోగుల ప్రమీణ అనే ముగ్గురు నిందితులను అరెస్టుచేసి వారివద్దనుండి రెండులక్షల 45వేల విలువైన 92గ్రాములు బంగారపు వస్తువులు, 15వేలరూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కందుకూరు డిఎస్‌పి ప్రకాశరావు ఆధ్వర్యంలో పామూరు సిఐ, ఎస్‌ఐ వారి సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. పై ముగ్గురు దొంగలు పామూరు, కందుకూరు, వరికుంటపాడు పోలీసుస్టేషన్లపరిధిలోను, ఉలవపాడుపోలీసుస్టేషన్‌పరిధిలో ఇంటి దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. పై కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్‌పి అభినందించారు. అదేవిదంగా మరోకేసు వివరాలను ఎస్‌పి తెలియచేస్తూ ప్రయాణిస్తున్న వారిబ్యాగులను చోరీచేసే మహిళాదొంగను అరెస్టుచేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఆదినారాయణపురం గ్రామానికి చెందిన కావటి వరలక్ష్మి అనే మహిళా నిందితుడిని అరెస్టుచేసి సుమారు రెండులక్షల10వేలరూపాయల విలువైన 84గ్రాముల బంగారుఅభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కారంచేడు, చీరాల, ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఆమె బ్యాగు దొంగతనానికి గురైనట్లు తెలిపారు. పై కేసులను ఛేదించిన చీరాల డిఎస్‌పి ప్రేమ్‌కాజల్, చీరాల రూరల్ సిఐ,కారంచేడు ఎస్‌ఐ, వారి సిబ్బందిని ఎస్‌పి అభినందించారు. అదేవిధంగా మరో కేసు వివరాలను ఎస్‌పి తెలియచేస్తూ నెల్లూరు జిల్లా కావలికి చెందిన కావటి లలిత అనే మహిళా నిందితురాలిని ఒంగోలు సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు చెప్పారు.లలిత అనే ముద్దాయిని అరెస్టుచేసి సుమారు 60వేల రూపాయల విలువైన 24గ్రాముల బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కందుకూరు పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఈమె బ్యాగు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఒంగోలు సిసిఎస్ డిఎస్‌పి కె వెంకటేశ్వరరావు,వారి పోలీసు సిబ్బందిని ఎస్‌పి అభినందించారు. అదేవిధంగా కందుకూరు మండలం బలిజపాలెం గ్రామానికి చెందిన దారా కోటేశ్వరరావుఅనే నిందితుడిని అరెస్టు చేసి ఆరులక్షల విలువైన ఆరుట్రాక్టరు ట్రక్కులను కందుకూరు డిఎస్‌పి ప్రకాశరావు ఆధ్వర్యంలో పొన్నలూరు ఎస్‌ఐ, వారి సిబ్బంది శుక్రవారం అరెస్టుచేసి నిందితుడి నుండి సుమారు ఆరులక్షల రూపాయల విలువైన ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పొన్నలూరు, టంగుటూరు, కొండెపి, కందుకూరు రూరల్, జరుగుమల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో ట్రాక్టర్ ట్రక్కుల కేసులో నిందితుడిగా ఎస్‌పి తెలిపారు. పై కేసును ఛేదించిన డిఎస్‌పి ప్రకాశరావుతోపాటు వారి సిబ్బందిని ఎస్‌పి అభినందించారు. విలేఖర్ల సమావేశంలో ఎఎస్‌పి బి రామానాయక్, కందుకూరు డిఎస్‌పి ప్రకాశరావు, దర్శి డిఎస్‌పి రాంబాబు, చీరాల డిఎస్‌పి ప్రేమ్‌కాజల్ పాల్గొన్నారు.