ప్రకాశం

కందుకూరులో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, జూన్ 10 : పట్టణంలోని 30వ వార్డులో గల 60 అడుగుల రోడ్డులోని 270, 271 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఉన్న ఆక్రమణలను శుక్రవారం అధికారులు కూల్చివేశారు. గత కొంతకాలంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్న పలువురి ఇళ్లను కనిగిరి సిఐ యు సుధాకర్‌బాబు, పట్టణ, రూరల్, గుడ్లూరు ఎస్‌ఐలు సిహెచ్ హజరత్తయ్య, కె సురేష్‌బాబు, విజయచంద్ పోలీసుల సహకారంతో తహశీల్దార్ వి వెంకటేశ్వరరావు ప్రొక్లైయిన్ ద్వారా ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమ నివాసాలను కూల్చివేస్తే దిక్కులేకుండా పోతుందని, కుటుంబమంతా మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్, పోలీసు అధికారులు ఆయా కుటుంబాల వారితో పలు ధపాలుగా చర్చించి ఇంట్లో సామాన్లు బయటవేయించి ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ విలేఖర్లతో మాట్లాడుతూ రంగారావు అనే వ్యక్తి రహదారిని ఆక్రమించుకుని నివాసాలను ఏర్పరుచుకున్నారంటూ కోర్టుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినప్పటికీ వారు స్పందించలేదని, దీంతో కోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణలు కూల్చివేసినట్లు ఆయన తెలిపారు.