ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ అరెస్టుకు నిరసనగా రాష్టవ్య్రాప్త నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. తన ఇంట్లో దీక్ష చేస్తున్న ముద్రగడను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో కాపు సంఘాలు ముద్రగడకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నాయి. మరోపక్క రైలు దగ్థం చేసిన ఘటనలో అరెస్ట్‌లు, ముద్రగడ వ్యవహార శైలిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు సమర్థిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కాపుల ఆత్మీయ సభలో చంద్రబాబును కాపు మిత్రగా అభివర్ణిస్తూ తీర్మానం చేశారు. కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో శుక్రవారం విజయవాడలో జరిగిన సమావేశంలో కొన్ని తీర్మానాలను ఆమోదించారు. తుని ఘటనను శాంతిభద్రత సమస్యగా కాకుండా, రాజకీయ కోణంలో చూడాలని తీర్మానించారు. కాపు రిజర్వేషన్ కోసం పోరాటం సాగిస్తున్న వారిపట్ల ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలని తీర్మానించారు. కాపు పోరాట నాయకులకు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు సృష్టించే నాయకులపట్ల ప్రభుత్వం జాగ్రత్తతో వ్యవహరించాలని తీర్మానించారు. నవ నిర్మాణ దీక్షలో కాపు ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల వివక్ష చూపించడాన్ని ఖండిస్తూ తీర్మానించారు. ముద్రగడకు ప్రాణ హాని పొంచి ఉన్నందున, ఆయనకు అత్యున్నత భద్రత కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. కాపు ఉద్యమంపట్ల ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ తీర్మానించారు. మంజునాథన్ కమిషన్‌ను గడువులోగా నివేదిక వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని తీర్మానించింది. అలాగే ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని, అవసరమైతే బంద్ కూడా జరపాలని కాపునాడు నాయకులు రామసుబ్రహ్మణ్యం తెలియచేశారు.
కమిషన్‌కు సమయం ఇవ్వండి: నారాయణ
కాపులను బిసిల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను వేసింది. కమిషన్ పనులు ప్రారంభించింది. ఆదరబాదరగా నివేదిక ఇవ్వడం సాధ్యం కాదు. అంతవరకూ కాపులంతా సంయమనంతో ఉండాలని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ముద్రగడ ఉద్యమం వెనుక జగన్ ఉన్నాడని ఇప్పటి వరకూ తాము చెపుతున్నాం. ముద్రగడ దీక్షకు మద్దతుగా జగన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఉద్యమంలో జగన్ పాత్ర అర్థమైందని అన్నారు.
ముద్రగడ కోరితే
సిబిఐ విచారణ: చినరాజప్ప
విజయవాడ, జూన్ 10:ముద్రగడ కోరితే తుని ఘటనపై సిబిఐ విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోం మంత్రి చినరాజప్ప వెల్లడించారు. తుని ఘటన జగన్ డైరక్షన్‌లోనే జరిగిందని ఆయన అన్నారు. కాపు ఉద్యమంలో భాగంగా పలువురిపై పెట్టిన కేసులను ఉపసంహరించడం సాధ్యం కాదని హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. శుక్రవారం సిఎంఓలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రౌటీషీటర్లు, కుట్రదారులపై పెట్టిన కేసులు ఏవిధంగా ఎత్తివేస్తామని ప్రశ్నించారు. రైలు దగ్థం కేసుకు సంబంధించి మూడు నెలల కిందటే సిబిఐ కేసు నమోదు చేసిందని అన్నారు. ఇంట్లో కూర్చుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని,ఆయన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు.

విడుదల చేయాలి: కాంగ్రెస్
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జూన్ 10: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని, కాపునాయకులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేరుతో పార్టీ ఒక ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. కాపు సామాజిక వర్గానికి బీసీ హోదా విషయంలో కాంగ్రెస్ పూర్తి మద్దతునిస్తుందని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు.
అమరావతిలో విట్‌కు 150 ఎకరాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 10: రాజధాని అమరావతిలో ప్రముఖ సంస్థలకు భూములను కేటాయిస్తూ సిఆర్‌డిఏ నిర్ణయం తీసుకుంది. ఇందులో వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)కు 200 ఎకరాలను కేటాయించినట్టు మంత్రి నారాయణ తెలియచేశారు. అలాగే శ్రీ రామచంద్ర మిషన్‌కు 150 ఎకరాలు, ఇండో-యుకే సంస్థకు 150 ఎకరాలను కేటాయించిందని ఆయన చెప్పారు. ఎకరాకు 20 నుంచి 50 లక్షల చొప్పున ఆయా సంస్థలకు భూములను ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలియచేశారు. ఇదిలా ఉండగా రాజధానికి భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ఈ నెల 20 నుంచి ప్లాట్‌లను కేటాయిస్తామని చెప్పారు. లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయిస్తున్నామని ఆయన తెలియచేశారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల పేరునే లాటరీ తీస్తామని, ఈలోగా భూములు చేతులు మారితే ఇబ్బందులు వస్తాయని భూ అమ్మకాలు, కొనుగోళ్లపై ఆంక్షలు విధించామని ఆయన తెలియచేశారు. సుమారు 10 వేల ఎకరాలను రైతులకు ప్లాట్ల రూపంలో ఇవ్వాల్సి వస్తోందని ఆయన చెప్పారు.
ఏసిబి వలలో మున్సిపల్ ఇంజనీర్
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూన్ 10: జిల్లాలోని ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న గండుబిల్లి రవి శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వాటర్ ట్యాంక్ వద్ద అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడిలో 50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్పీ కె.రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లికి చెందిన దాడి శ్రీనివాసరావు అనే పైపులైన్ కాంట్రాక్టర్ సుమారు రూ.35 లక్షలతో పైపులైన్ పనులు చేస్తుండగా రూ.10 లక్షల స్పాట్ పేమెంట్ బిల్లు ఇవ్వడానికి ఏఇ రవి రూ.50 వేల డిమాండ్ చేసినట్లు రంగరాజు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిని లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు రంగరాజు తెలిపారు.
మధ్యాహ్న భోజనంలో తేలు!
సోమందేపల్లి, జూన్ 10: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వడ్డించిన అన్నంలో తేలు కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మండ్లిలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండ్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు శుక్రవారం యథావిధిగా విద్యార్థుల కోసం అన్నం వండారు. మధ్యాహ్నం విద్యార్థులకు ఆ అన్నం వడ్డించారు. ఓ విద్యార్థికి వడ్డించిన అన్నంలో ఉడికిన తేలు కనిపించింది. దీంతో ఆ విద్యార్థి భయాందోళనకు గురై అన్నంలో తేలు అంటూ గట్టిగా కేకలు వేశాడు. అయితే అప్పటికే అన్నం తిన్న 20 మంది విద్యార్థులు భయంతో వణికిపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిని వెంటనే వైద్యపరీక్షల కోసం సోమందేపల్లి ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ గిరిధర్ ఆ విద్యార్థులను పరీక్షించి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు.
చురుగ్గా నైరుతి రుతుపవనాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 10: రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి దిశగా రుతుపవనాలకు అనుకూల వాతారణం నెలకొనడంతో మరో రెండు రోజుల్లో ఇవి రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తాలో ప్రభావాన్ని చూపుతున్న రుతుపవనాలు మరింత బలపడి, పూర్తి స్థాయిలో అనుకూలంగా మారనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు, రాయలసీమలో కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
వాహనాల దొంగల ముఠా అరెస్ట్
కుప్పం, జూన్ 10: జల్సాలకు అలవాటు పడిన ఐదుగురు యువకులు ముఠాగా కలిసి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో తొమ్మిది కార్లు, రెండు ద్విచక్రవాహనాలను దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డారు. తమ ఘనకార్యం గుట్టు బయటపడుతుందని తెలిసిన ఈ ముఠా సభ్యులు సొంత పిన్నినే గత నెల 9న రామకుప్పం మండలం వీర్నమల తాండలో హతమార్చి ఆ తరువాత పెట్రోలుపోసి తగలబెట్టినట్టు కూడా పోలీసులు ధ్రువీకరించారు. శుక్రవారం కుప్పం సర్కిల్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ విలేఖర్లతో మాట్లాడుతూ రామకుప్పం మండలం వీర్నమల తండాకు చెందిన శ్యామరాజ్‌నాయక్, అతని స్నేహితుడు రవికుమార్‌నాయక్ కలసి వాహనాలను దొంగతనం చేసేవారు. ఈ విషయం బయటపెడుతుందని సొంత పిన్ని లక్ష్మమ్మను గత నెల 9న హత్య చేసి అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టి పరారైయ్యారన్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరిమానుపెంట రోడ్డులో అనుమానస్పదంగా తిరుగుతున్న వీరిని సిఐ రాజశేఖర్, ఎస్సైలు పరశురాం, భాస్కర్, గోపి, ఐడి పార్టీ సిబ్బంది కలసి పట్టుకొని విచారించగా తన పిన్ని లక్ష్మమ్మను తామే హత్య చేసినట్లు శ్యామరాజ్‌నాయక్ అంగీకరించానని తెలిపారు. ఈ హత్యకు స్నేహితుడు రవికుమార్‌నాయక్ సహకరించినట్లు చెప్పాడు. ఈ కేసు విచారణలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన దశరథన్, అరుల్, సుభాష్‌లతో కలసి వాహనాలను దొంగతనం చేసి విక్రయించే వారని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
ప్రభుత్వాసుపత్రుల్లో
గుండె మార్పిడి చికిత్సలు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జూన్ 10: ఇకపై అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో గుండె మార్పిడి శస్తచ్రికిత్సలకు సంబంధించి ఆధునాతన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల గుండె మార్పిడి శస్తచ్రికిత్స చేయించుకున్న ఏడుకొండలును మంత్రి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఈ-వైద్యంతో పాటు తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టి నిరుపేదల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు.

తుని ఘటనలో
13కు చేరిన అరెస్టులు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూన్ 10: కాపుల ఐక్య గర్జన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో చెలరేగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి మరో ఆరుగురు నిందితులను సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కాపునాయకులు గణేషుల రాంబాబు (అమలాపురం), గణేషుల లచ్చబాబు (అమలాపురం), వాసిరెడ్డి ఏసుదాసు(కాకినాడ), ఆకుల రామకృష్ణ (కొత్తపేట), నల్లా విష్ణు(అమలాపురం), చెక్కపల్లి సత్యనారాయణ (కిర్లంపూడి)లను కాకినాడ సిఐడి కోర్టులో హాజరుపరిచారు. 24వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. 7న ఏడుగురికి ఈనెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే! కోటనందూరు మండలం బిళ్ళనందూరుకు చెందిన లగుడు శ్రీనివాస్, అమలాపురం పట్టణానికి చెందిన దూడల మణీంద్ర అనే ఫణీంద్ర, గుంటూరుకు చెందిన గోపీ మహేష్, ఎం పవన్‌కుమార్, అంబాజీపేటకు చెందిన నక్కా సాయి, పిఠాపురం మండలం విరవాడకు చెందిన కూరాకుల పుల్లయ్య, కోలంకకు చెందిన శ్రీహరిబాబు అనే నిందితులు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. వీరందరినీ 143, 307, ఐపిసి 3 అండ్ 4, 332, 109, 149, 7(1) తదితర సెక్షన్ల క్రింద కేసులు నమోదు శారు.

లాసెట్-2016లో
93.73 శాతం ఉత్తీర్ణత
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జూన్ 10: ఎపి లాసెట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. రాష్టవ్య్రాప్తంగా 31 కేంద్రాల్లో మే 28న నిర్వహించిన మూడేళ్లు, ఐదేళ్లు, పిజి ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో సమాచారశాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, ఎపి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, ఎపి లాసెట్-2016 కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్‌వి.పుల్లారెడ్డి, ఎస్కేయూ విసి రాజగోపాల్, రిజిస్ట్రార్ వెంకటరమణ విడుదల చేశారు. మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి, పిజి ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షలకు 10,499 మంది అభ్యర్థులు హాజరుకాగా 9,841 మంది అర్హత సాధించారని మంత్రి తెలిపారు. మొత్తం 93.73 శాతం ఉత్తీర్ణత సాధించగా ఇందులో అబ్బాయిలు 94.44 శాతం, అమ్మాయిలు 91.67 శాతం ఉన్నారన్నారు. ఎల్‌ఎల్‌బి మూడేళ్ల కోర్సుకు సంబంధించి 7,944 మంది పరీక్షలకు హాజరు కాగా, 7556 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. మొత్తం 95.21 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా వీరిలో అబ్బాయిలు 95.61 శాతం, అమ్మాయిలు 93.41 శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇందులో మొదటి ర్యాంకు అనంతపురం జిల్లాకు చెందిన బోయపాటి సురేష్‌కుమార్(109/120), రెండో ర్యాంకు ఇదే జిల్లాకు చెందిన బాల వెంకటేశులు(108/120), మూడో ర్యాంకు గుంటూరు జిల్లాకు చెందిన తోట చందన(108/120) కైవసం చేసుకున్నారన్నారు. అదే విధంగా ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుకు సంబంధించి 2,033 మంది పరీక్షకు హాజరుకాగా 1,770 మంది అర్హత సాధించారన్నారు. మ్తొతం 87.06 శాతం ఉత్తీర్ణత సాధించగా ఇందులో అబ్బాయిలు 87.71 శాతం, అమ్మాయిలు 85.87 శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు.
ఇందులో మొదటి ర్యాంకు గుంటూరు జిల్లాకు చెందిన సాధుసాంబ కైలాష్ (99/120), రెండోర్యాంకు విశాఖపట్నం జిల్లాకు చెందిన కుముజ శ్రీసత్యప్రణీత్ (98/120), మూడో ర్యాంకు రంగారెడ్డి జిల్లాకు చెందిన అమ్యూశ్రీ సోమిరెడ్డి(96/120) సాధించారని మంత్రి వివరించారు. ఇక పిజి ఎల్‌ఎల్‌సెట్ పరీక్షకు 522 మంది హాజరు కాగా, 515 మంది ఉత్తీర్ణలయ్యారన్నారు. ఇందులో 98.66 శాతం ఫలితాలు రాగా అబ్బాయిలు 99.15 శాతం, అమ్మాయిలు 97.66 శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇందులో మొదటి ర్యాంకు విశాఖపట్నం జిల్లాకు చెందిన హిమాన్షు పాండే(86/120), రెండో ర్యాంకు కృష్ణా జిల్లాకు చెందిన మోగంటి రామశాంతి (86/120), మూడో ర్యాంకు హైదరాబాదుకు చెందిన ఎన్.గోపీధర్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థినీవిద్యార్థులు, వారి తల్లిదండ్రులను మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభినందించారు.
లాసెట్ ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి పల్లె