రాష్ట్రీయం

జేఈఈలోనూ మనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: జేఈఈ అడ్వాన్స్డ్-2016 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మిగతా జాతీయ స్థాయి పరీక్షల్లో మాదిరిగానే ఇందులో కూడా తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 100 ర్యాంకుల్లో 30 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండడం గమనార్హం. ఒబిసి నాన్ లోకల్ కేటగిరీలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అమన్ బన్సల్ ప్రథమ ర్యాంక్ దక్కించుకోగా, యమునానగర్‌కు చెందిన భవేష్ ధింగ్రా రెండో ర్యాంక్‌ను, జైపూర్‌కే చెందిన కునాల్ గోయల్ మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నారు.
విజయవాడకు చెందిన దుగ్గాని జీవితేశ్ నాలుగో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన రియా సింగ్ అమ్మాయిల్లో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది మొదటి పది ర్యాంకుల్లో మద్రాస్ జోన్‌కు ఐదు ర్యాంకులు రావడం గమనార్హం. ఎస్‌టి కేటగిరీలో పుంగనూరుకు చెందిన ముదె చైతన్య నాయక్ టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. దివ్యాంగుల కేటగిరీలో గుంటూరుకు చెందిన కల్లూరి హరిప్రసాద్ ప్రథమస్థానం సాధించాడు.
కష్టపడి చదివా : జీవితేశ్
విజయవాడ: కష్టపడి చదవడమే విజయానికి కారణమని నాలుగో ర్యాంకర్ జీవితేశ్ ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. రోజుకు పది గంటలు చదివేవాణ్నని, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకున్నానని అన్నాడు. విజయవాడ మధురానగర్‌కు చెందిన జీవితేశ్ తండ్రి శివకుమార్ మాట్లాడుతూ తమ కుమారుడు ఆలిండియా ఓపెన్ కేటగిరిలో నాలుగో ర్యాంకు సాధించటం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు.

చిత్రం టాప్ ర్యాంకర్ అమన్, 4వ ర్యాంకర్ జీవితేశ్