బిజినెస్

ఈపిడిసిఎల్ సేవలు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 17: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపిడిసిఎల్) అత్యుత్తమమైన సంస్థ అని మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతినిధుల బృందం కితాబిచ్చింది. శుక్రవారం ఆ బృందం ఇక్కడకు వచ్చింది. ఏపీఈపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని ఈ బృందం సందర్శించింది. మూడు రోజుల అధ్యయనం నిమిత్తం మధ్యప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ (టెక్నికల్) డాక్టర్ మురహరి, ఎస్‌కె కెలే నేతృత్వంలో ప్రాతినిథ్య సభ్యులైన భోపాల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ జిఎస్ ఖనూజా, భోపాల్ డిజిఎం వికెఎస్ పరిహార్, జబల్‌పూర్ డిఇ ఇమ్రాన్ ఖాన్ వచ్చారు.
వీరికి ఈపిడిసిఎల్ డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టివిఎస్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. వినియోగదారులకు అందిస్తున్న విశిష్ట సేవలకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ డైరెక్టర్లు ఈ బృందానికి వివరించారు. వినియోగదారులకు సహాయకారిగా ఉండేందుకు ఈపిడిసిఎల్ రూపొందించిన విద్యుత్ ప్రవాహ్ మొబైల్ యాప్, ఉద్యోగులకు ఉపయోగపడే మైఇపి అనే మొబైల్ యాప్ పనితీరు గురించి వివరించారు. మెటీరియల్ సేకరణ చేసే ఇ-స్టోర్, నెలవారీ విద్యుత్ బిల్లింగ్, ఆన్‌లైన్ బిల్లింగ్, సింగిల్ గ్రూప్ బిల్లింగ్, ఆన్‌లైన్ వసూళ్ళు, ఎనర్జీ ఆడిట్ వ్యవస్థ, విద్యుత్ కొనుగోలు, హెచ్‌టిఎంఎంఆర్ వ్యవస్థ, పర్యవేక్షణ, రైతులకు అందిస్తున్న ఏడు గంటల నిరంతర విద్యుత్ సరఫరా, రైతులకు సౌర విద్యుత్ పంపుసెట్లు సబ్సిడీ ధరలకే అందచేస్తున్న విధానాలను సవివరంగా తెలియజేశారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఇఆర్‌సి) ల్యాండ్ మార్కు నిర్ణయాలు, సంస్థ పరిధిలోని కింది స్థాయి విభాగం నుంచి అమలు చేస్తున్న కాగిత రహిత (ఇ-ఆఫీస్) వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేసిన విధానం గురించి వారికి తెలిపారు. సంస్థ విధానాలతో రానున్న మూడేళ్ళల్లో విద్యుత్ పంపిణీ నష్టాలు నాలుగు శాతానికి తగ్గించాలనే లక్ష్యాన్ని ఈ బృందానికి వెల్లడించారు. ప్రధానంగా దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డిడియుజిజెవై పథకం, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలెప్‌మెంట్ స్కీమ్ (ఐపిడిఎస్) పథకాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ విద్యుద్దీకరణ గృహాలు, విద్యుత్ నెట్‌వర్క్‌ను బలపరిచే విద్యుద్దీకరణ లక్ష్యంగా ఏ విధంగా అమలు చేసారో తెలియజేశారు. ఇన్ఫారెడ్ డేటా సముపార్జన (ఐఆర్‌డిఏ) మీటర్ల సంస్థాపన ఫిక్సింగ్ 3 స్టార్, 5 స్టార్ రేటింగ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, రికన్‌స్ట్రక్ట్‌డ్-యాక్సిలరేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ అండ్ సంస్కరణల ప్రోగ్రాం (ఆర్-ఏపిడిఆర్‌పి) సాధనను ఈ బృందానికి వివరించారు. ఈ విధంగా దేశంలో ఉన్న 48 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పరిధిలో మరెక్కడా అమలుకాని దాదాపు 20 రకాలైన సరికొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు పటిష్టంగా అమలు చేయగలుగుతున్న తీరుపట్ల ఈ బృందం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. వీటన్నింటిని దశలవారీగా తమ రాష్ట్రంలోను అమలుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఈపిడిసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి రమేష్ ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్లు పివివి సత్యనారాయణ (ఓఅండ్ సిఎస్), కెఎస్‌ఎన్ మూర్తి (కమర్షియల్ అండ్ ఆర్‌ఏసి), చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్సు) విజయలలిత తదితరులు పాల్గొన్నారు.

ఈపిడిసిఎల్ ప్రగతిని మధ్యప్రదేశ్ అధ్యయన బృందానికి
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్న అధికారులు
ఎగుమతుల పురోగతికి
ప్రోత్సాహకాలు అందిస్తాం
వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

ఈపిడిసిఎల్ సేవలు అద్భుతం
దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ సంస్థ
మధ్యప్రదేశ్ డిస్కమ్ అధ్యయన బృందం కితాబు
ఆంధ్రభూమి బ్యూరో