మహబూబ్‌నగర్

ఎంతటి త్యాగాలకైనా సిద్ద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూన్ 24: గద్వాల జిల్లా ఏర్పాటు నడిగడ్డ ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవ పోరాటమని వారి అభిప్రాయం మేరకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధ్దంగా ఉన్నామని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని డికె సత్యారెడ్డి బంగ్లాలో ఏర్పాటు చేసిన ఉద్యమ భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమం అనంతరం విలేఖరులతో మాట్లాడారు. నడిగడ్డ ప్రజల పిల్లల భవిష్యత్ కోసం జిల్లాను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాల పేరిట కాలయాపన చేసి రాజకీయ దురుద్దేశంతో కొందరిని సంతృప్తి పరిచేందుకు అన్ని అర్హతలు ఉన్న గద్వాలకు అన్యాయం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ పది జిల్లాల తరువాత ఏ ఒక్క నూతన జిల్లా ఏర్పాటు చేయదలిస్తే అన్ని అర్హతలు ఉన్న గద్వాలనే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా జిల్లా సాధన కోసం శాంతియుతంగా ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగిందని అయినప్పటికి ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడంతో ఉద్యమాన్ని ఉదృతం చేసి మహా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. అధికార యంత్రాంగం పాలకుల మాటలకు తలొగ్గకుండా నిస్పక్షపాతంగా జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వ నిబంధనల మేరకు నివేదికలు సిద్దం చేయాలని సూచించారు. గద్వాల జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ప్రతి ఒక్కరితో కలిసి ముందుకు సాగుతామని అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యచరణలో భాగంగా వచ్చే నెల 1వ తేదిన 44వ జాతీయ రహదారి దిగ్బందం, 3వ తేది నుంచి అలంపూర్ జోగుళాంబ నుంచి గ్రామాల మీదుగా గద్వాల జములమ్మ వరకు పాదయాత్ర, హైదరాబాద్‌కు పాదయాత్ర, నిరవదిక నిరాహార దీక్షతో పాటు బస్సుయాత్రలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని అర్హతలు ఉన్న ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవించని పాలకులకు నడిగడ్డ పౌరుషం తెలిపేవిధంగా ఉద్యమాలు చేపడుతామన్నారు. జిల్లా సాధన కోసం గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని గ్రామ గ్రామాలు పిల్లా పాపలతో రోడ్లపైకి వచ్చి తమ ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకవచ్చి కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు ఐక్యమత్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఇందుకు కలిసి వస్తున్న నర్వ, ఆత్మకూర్ ప్రాంత ప్రజలను కూడ కలుపుకుపోతామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.