విజయనగరం

అవినీతి అంగన్‌వాడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 12: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం వాడీవేడిగా జరిగింది. ముఖ్యంగా అంగన్‌వాడీ కార్యకర్తల నియామకంలో అక్రమాలు జరిగాయంటూ వైసిపి ప్రజాప్రతినిధులు సమావేశంలో నిలదీశారు. కేంద్రాల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, కార్యకర్తల నియామకంలో అవినీతి చోటుచేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, రాజన్నదొర, పుష్పవాణి జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆరోపించారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా పిల్లలకు, గర్భిణులకు సరైన పౌష్టికాహారం లభించటం లేదని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతిరాణి అధ్యక్షతన శనివారం జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా ఇన్‌చార్జ్, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, జిల్లామంత్రి డాక్టర్ మృణాళిని, కలెక్టర్ ఎంఎం నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలోనే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మహిళా, శిశుసంక్షేమ కార్యక్రమాలపై జరిగిన చర్చలో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా జరగటం లేదని, దీనివల్ల పిల్లల భవిష్యత్ చదువులపై ప్రభావం ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన అంగన్‌వాడీ కార్యకర్తల నియామకంలో మెరిట్ ప్రకారం కాకుండా సిఫారసుల మేరకు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్భిణులకు గతకొన్ని వారాలుగా పౌష్టికాహారం పెట్టడం లేదని, దీనిపై ప్రశ్నిస్తే డైట్ బిల్లులు భారీగా పెండింగులో ఉన్నట్లు సమాధానం చెబుతున్నారని తెలిపారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పవాణి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు నూనె, పప్పు సరఫరా జరగలేదని, దీనివల్ల గిరి గోరుముద్దలు కార్యక్రమం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. అంగన్‌వాడీలకు వేతనం తక్కువగా ఉన్నా, ఇటీవల జరిగిన నియామకాల్లో తన నియోజకవర్గంలో ఒక్కో పోస్టుకు రెండు నుంచి మూడులక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయని, దీనివెనక మతలబు ఏమిటని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అంగన్‌వాడీల నియామకాలపై ప్రతిపక్షాల నుంచే కాకుండా, టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జగదీష్ ఆందోళనకు దిగటం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోందని అన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అంగన్‌వాడీ నియామకాల్లో అవకతవకలపై ఆధారాలతో ఫిర్యాదుచేస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అద్ద్భెవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించటం వలన ఇబ్బందులు కలుగుతున్నాయని కురుపాం జడ్పీటిసి సమావేశం దృష్టికి తీసుకురాగా, రేషనలైజేషన్ ద్వారా విలీన పాఠశాల భవనాలలో ఖాళీ భవనాలను అంగన్‌వాడీ కేంద్రాలకు కేటాయిస్తామని చెప్పారు. గ్రామపంచాయతీలు 50శాతం నిధులు ఇస్తే, మిగతా సగం నిధులు ఎన్‌ఆర్‌ఇజిపి కింద కేటాయించి అంగన్‌వాడీ భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంలో బొండపల్లి జడ్పీటిసి బాలాజీ జోక్యం చేసుకుని తమకు కనీస సమాచారం లేకుండా, గ్రామపంచాయతీల తీర్మాణం లేకుండా అధికారులే అంగన్‌వాడీల భవన నిర్మాణాలకు టెండర్లు పిలుస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
బొండపల్లి మండల కేంద్రంలో జడ్పీ హైస్కూల్ భవన నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జడ్పీటిసి సభ్యుడు సమావేశంలో ప్రస్తావించగా, దీనిపై ఇన్‌చార్జ్ మంత్రి రఘునాథరెడ్డి స్పందిస్తూ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టి, ఆయన నుంచి డబ్బు రికవరీ చేయాలని ఆదేశించారు. ఇదే సందర్భంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పాఠశాలల భవనాలు ప్రారంభానికి నోచుకోకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయని పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురాగా, వీటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని, సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రులు మృణాళిని, రఘునాథరెడ్డి స్పష్టం చేసారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసి మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించటంలో విఫలమవుతోందని పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎంపిపిలు సమావేశంలో ఆరోపించారు. ముఖ్యంగా నైట్‌హాల్ట్ సర్వీసులు రద్దుచేయటంతో గిరిజన ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవలసి వస్తోందని సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు, జామి జడ్పీటిసి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే కెఎ నాయుడు ఆర్టీసి అధికారులకు వత్తాసుగా మాట్లాడగా, కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసి సిబ్బంది వ్యవహార శైలి, వైఫల్యాల కారణంగానే నష్టాలు కలుగుతున్నాయే తప్ప మరేమి కాదని అన్నారు. దీనిని జడ్పీ చైర్మన్ స్వాతిరాణి సమర్థించారు. విజయనగరం నుంచి తాత్కాలిక రాజధాని విజయవాడకు ప్రైవేటు ఆపరేటర్లు 20కిపైగా ఓల్వో, లగ్జరీ బస్సులు నడుపుతుంటే ఆర్టీసి ఒక్క బస్సు కూడా నడపకపోవటాన్ని ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు ప్రశ్నించారు. పార్వతీపురం నుంచి చినమేరంగి ద్వారా కురుపాంకు, ఎస్.కోట నుంచి జామి ద్వారా విశాఖకు బస్సులు నడపాలని కురపాం, జామి జడ్పీటిసిలు కోరారు. ఈ సందర్భంలో జిల్లాలోని ఐదు డిపోల ద్వారా ఎన్ని బస్సులు నడుపుతున్నారని మంత్రి రఘునాథరెడ్డి ప్రశ్నించగా ఆర్టీసి డిపో మేనేజర్ పద్మావతి సమాధానం చెప్పలేకపోయారు. దాంతో ఎమ్మెల్సీ కోలగట్ల జోక్యం చేసుకుని జిల్లావ్యాప్తంగా ఆర్టీసి 360కిపైగా బస్సులు నడుపుతోందని తెలిపారు. ఇకనుంచి జడ్పీ సమావేశాలకు ఆర్టీసి రీజనల్ మేనేజర్ తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని కలెక్టర్‌కు మంత్రి రఘునాథరెడ్డి సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగిన సందర్భంలో తారకరామ తీర్థసాగర్ నుంచి విజయనగరం పట్టణానికి మంచినీటి సరఫరా చేసేందుకు చేపట్టిన పథకాన్ని సత్వరం పూర్తిచేయాలని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. జిల్లాలో గృహనిర్మాణ పథకంపై చర్చ జరిగిన సందర్భంలో జిల్లాలో ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకన నడుస్తున్నాయని, అర్హులకు ఇళ్లు మంజూరయినా నిర్మాణాలు జరగటం లేదని ఎమ్మెల్సీ కోలగట్ల సమావేశంలో తెలపగా, గత ప్రభుత్వం హయాంలో ఇళ్ల మంజూరులో జరిగిన అవినీతి కారణంగా తాము ఇపుడు ఇబ్బందులు పడుతున్నామని గృహనిర్మాణ శాఖను నిర్వహిస్తున్న మంత్రి మృణాళిని వ్యాఖ్యానించారు. దాంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరుగగా మరో మంత్రి రఘునాథరెడ్డి సర్ధిచెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీలు జగదీష్, సంధ్యారాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామి, కోళ్ల లలితకుమారి, చిరంజీవులు, జడ్పీ సిఇఓ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ కమిషనర్
బాధ్యతల స్వీకరణ
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 12: విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్‌గా జి.నాగరాజు శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్‌గా వ్యవహరించిన ఎం.మల్లయ్యనాయుడు కొత్త కమిషనర్ నాగరాజుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో నాగరాజు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజును మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు,మున్సిపల్ రెవెన్యూ అధికారి డేవిడ్, మెప్మా ప్రాజెక్టు అధికారి సరోజని, మున్సిపల్ అకౌంట్స్ అధికారి రోజా వెంకటలక్ష్మి తదితరులు కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.