గుంటూరు

కాశీవిశే్వశ్వరస్వామి ఆలయంలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకరికల్లు, జూలై 1: అన్నపూర్ణా సమేత కాశీవిశే్వశ్వరస్వామి ఆలయంలో దుండగులు ప్రవేశించి ఆభరణాలు అపహరణకు గురైన సంఘటన తెలుసుకుని స్థానికులు నిర్ఘాంతపోయారు. వివరాల ప్రకారం నర్సింగపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీఅన్నపూర్ణా సమేత కాశీవిశే్వశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి అన్నపూర్ణాదేవి అమ్మవారి, విఘ్నేశ్వర స్వామి, వీరభద్రస్వామివార్లకు అలంకరించిన ఆభరణాలను, పలు పూజా సామగ్రిని దుండగులు అపహరించారు. అమ్మవారి వెనుకవైపు ఉన్న మకరతోరణం, వెండితొడుపును దుండగులు అపహరించి ఖాళీ చెక్కను మాత్రం సమీపంలోని పొలాల్లో పడేశారు. ఆలయానికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్ రామారావు తెల్లవారుజామున లేచి ఆలయ ప్రధాన ద్వారం గేటు తెరిచి ఉండడాన్ని గమనించి ఆలయ ధర్మకర్త పమిడిమర్రి శ్రీనివాస్‌కు సమాచారం అందించాడు. ధర్మకర్త శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులకు సమాచారాన్ని అందచేసి, నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రమేష్ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. రూరల్ సిఐ ప్రభాకర్‌కు సమాచారం అందచేశారు. సిఐ ప్రభాకర్ సంఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీం సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రామారావు, డాగ్ స్క్యాడ్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని ఆధారాలను సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చోరకులు క్యూలైన్ మార్గం గేటు తాళాన్ని పగులకొట్టి ఆలయంలోకి ప్రవేశించారని, అనంతరం ప్రధాన ద్వారానికి అమర్చిన ఇనుప గేటు తాళాలు పగులకొట్టి అమ్మవారి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అన్నపూర్ణాదేవి అమ్మవారికి అలంకరించిన ఆభరణాలను, విఘ్నేశ్వర, వీరభద్రస్వామివార్లకు అలంకరించిన వెండి ఆభరణాలను, వెండి కిరీటాలు, హస్తాలు, పాదుకులు, చెటారు, పళ్ళెం తదితర వస్తువులతో పాటు అమ్మవారికి అలంకరించిన బంగారు హారం, మంగళ సూత్రాలు అపహరణకు గురయ్యాయి. సంఘటనలో సుమారు 12 కిలోల వెండి, 40 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు సిఐ ప్రభాకర్ పర్యవేక్షణలో నరికల్లు ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని, గతంలో కూడా ఈ ప్రాంతంలో జరిగిన చోరీలను చేదించామని తెలిపారు. 2008 ఇదే ఆలయంలో చోరీ జరిగిన సంఘటన మరోసారి జరగడంతో స్థానికులు తండోపతండాలుగా ఆలయం వద్దకు చేరుకున్నారు.