తెలంగాణ

ఎస్పీ ఎదుట నరుూం అనుచరుల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 15: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమకారుడైన నరుూం ముఠా అనుచరులు రౌడిషీటర్ పాశం శ్రీను, భువనగిరి జడ్పీటీసి సందెల సుధాకర్‌లు శుక్రవారం మధ్యా హ్నాం అనూహ్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. తమ న్యాయవాది చత్రపతితో కలిసి వారు ఎస్పీ వద్ధకు వచ్చి లొంగిపోగా వారిని ఎస్పీ విచారించి అక్కడి నుండి ప్రత్యేక పోలీస్ ఎస్కార్ట్‌తో వరంగల్ జిల్లా జైలుకు తరలించారు. పాశం శ్రీను, సందెల సుధాకర్‌లపై నాలుగు నెలల క్రితం పిడి యాక్ట్ నమోదైంది. మాజీ మావోయిస్టు, టిఆర్‌ఎస్ నేత కొణపురి రాములు, వలిగొండకు చెందిన బాబర్‌ల హత్యలో నిందితుడిగా పాశం శ్రీనుపైన, సెటిల్‌మెంట్ల వివాదాల నేపధ్యంలో సుధాకర్‌పైన పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేశారు. పిడి యాక్ట్ నమోదు పిదప వారు పోలీసులకు చిక్కకుండా మహారాష్ట్ర, చిత్తూర్ తదితర జిల్లాలో తలదాచుకున్నారు. కాగా నరుూం ముఖ్య అనుచరులుగా ఉన్న పాశం శ్రీను, సుధాకర్‌లకు నరుూంతో విబేధాలు వచ్చిన నేపధ్యంలోనే వారు నరుూం నుండి ప్రాణహనీ ఉందన్న భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారంలో ఉంది. మరోవైపు నరుూం అనుచరుల ఏరివేతకు పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్‌కు జడిసే వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా మరో ప్రచారం సాగింది. ఇటీవల పాశం శ్రీను గుండెపోటుతో కరీంనగర్ మమత ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా వదంతులు సైతం చోటుచేసుకోవడం జరిగింది. తాజాగా శ్రీనుతో పాటు సుధాకర్ లొంగుబాటు వెనుక ఏం జరిగిందన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాశం శ్రీనుపై పలు హత్య కేసులు, వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉండగా, సుధాకర్‌పై సైతం పలు కేసులున్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి.