కరీంనగర్
నిండుకుండలా గుండారం రిజర్వాయర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 July 2016
కమాన్పూర్, జూలై 17: నిన్నమొన్నటి వరకు పూర్తి స్థాయిలో ఏడారిగా ఉన్న గుండారం రిజర్వాయర్ ప్రస్తుతం జలకళతో నిండుకుండలా కళకళ లాడుతుంది. గత వారం రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల గౌరీ గుండ జలపాతం ద్వారా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో గుండారం రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 12 అడుగులు కాగా ప్రస్తుతం 10 అడుగులకు పైగా నీరు చేరింది. దీంతో రిజర్వాయర్ కింది ఆయకట్టు రైతులు తమ తమ పొలం పనుల్లో నిమగ్నమయ్యి మొలక అలికేందుకు సిద్ధం అయ్యారు. అలాగే రిజర్వాయర్ నిండిపోవడంతో రైతన్నల్లో ఆనందం వెల్లి విరుస్తుంది.