కరీంనగర్

పచ్చని తెలంగాణ కోసం పాటుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని పచ్చని తెలంగాణ కోసం పాటుపడాలని జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. అదివారం మానకొండూర్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఈదులగట్టేపల్లి గ్రామంలో మొక్కలను నాటే కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈసందర్భంగా ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఐదు మొక్కలను నాటాలని తెలిపారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించావల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. పోలీసులు హరిత హారంలో భాగస్వాములై గ్రామ గ్రామాన మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈదులగట్టేపల్లి గ్రామంలో 3వేల మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిఎస్పీ రామారావు, సిఐ వెంకటరమణ, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఎంపిడివో వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ మీస వౌనిక, పోలీసులు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.