కరీంనగర్

స్థల పరిశీలన చేసిన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూలై 17: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధ దేవాలయైన శ్రీ నాంపల్లి లక్ష్మినరసింహస్వామి ఆలయ గుట్టను పర్యాటక క్షేత్రపరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అందుకనుగుణంగా ప్రణాళికలను రూపొందించించింది. గుట్టపై రోప్ వే.. నిర్మాణం చేపడితే ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, వేములవాడ ఏరియా అభివృద్ధి ప్రాధికారిక సంస్థకు చెందిన అధికారులు గుట్టపై రోప్‌వే.. నిర్మాణం చేసే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోప్ వే.. నిర్మాణం ఏ దిశ నుంచి చేపట్టాలో రెండు శాఖల అధికారులు సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు వెంకటేశ్వర్‌రావు, వాడా అధికారులు రమేశ్ తదితరులు పాలొన్నారు.
బస్‌స్టాండ్‌కు స్థల పరిశీలన
దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్ప దీక్షలో భాగంగా పట్టణంలోని జగిత్యాల బస్‌స్టాప్ సమీపంలో పదేకరాలలో 40్ఫ్లట్‌ల గల బస్‌స్టేషన్‌ను నిర్మించడానికి ఆదివారం వాడా అధికారులు స్థల పరిశీలన గావించారు. ఆధునాతన బస్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైయ్యే స్థలాన్ని పట్టాదారుల నుంచి ఎంత సేకరించాలో అధికారులు నివేదికలను తయారు చేస్తున్నారు.
స్వామివారి సేవలో..
శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు బృందం సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. కళ్యాణ మండపంలో అధికారులను అర్చకులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.