కరీంనగర్

ఏ పనైనా సరే.. చేతులు తడపాల్సిందే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 21: ఏ పనైనా సరే చేతులు తడపాల్సిందే..చేతులు తడపకుంటే ఏ పని జరగదు. నెలల తరబడి కార్యాలయం చుట్టు తిప్పించుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి చివరకు ఎసిబి అధికారులకు చిక్కి కటకటాలపాలయ్యారు. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో పరిపాలనాధికారి (ఎఓ)గా పనిచేస్తున్న రజనీచౌదరి, జమ్మికుంట విఆర్వో ఎం.శ్రీనివాస్‌లను గురువారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్ట్ చేశారు. వ్యవసాయ భూమిని తండ్రి పేరు నుంచి కుమారుడి పేరుకు మార్చేందుకు, పహాణిలో నమోదు చేసేందుకు, ఇసుక అక్రమ రవాణాలో సహకరిస్తూ లంచాలు తీసుకున్నట్లు తేలడంతో వీరిని ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. ఎసిబి డిఎస్పీ సుదర్శన్‌గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో జమ్మికుంట తహాశీల్దార్‌గా పనిచేసిన సమయంలో రజినీచౌదరి, విఆర్వో శ్రీనివాస్‌లు కలిసి జమ్మికుంట గ్రామ పంచాయితీ పరిధిలోని మోత్కులగూడెంకు చెందిన బిట్ల రామస్వామికి చెందిన ఒక ఎకరం 10గుంటల భూమిని తన కుమారుడు బిట్ల మోహన్‌కు విరాసత్ చేయడం కోసం ధరఖాస్తు చేసుకోగా, రూ.50వేలు డిమాండ్ చేసి, ఆ డబ్బులను తీసుకుని విరాసత్ చేశారు. అలాగే కనగర్తికి చెందిన వర్కుటి మదన్‌రావుకు వారసత్వంగా వచ్చిన 8.08ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పాసుబుక్కులు ఇప్పించాలని ధరఖాస్తు చేసుకోగా, రెండు నెలల పాటు తిప్పించుకోవడంతోపాటు రూ.4లక్షలు ఇస్తే పాసుబుక్కులు ఇస్తామని డిమాండ్ చేయడంతో చేసేదేమిలేక మదన్‌రావు రూ.4లక్షలు ముట్టజెప్పిన తరువాత పహాణీ 1బిలో నమోదు చేసి పాసు బుక్కులు అందజేశారు. ఇవేకాక పలు అవినీతి ఆరోపణలు రాగా, ఆ ఆరోపణలపై ఎసిబి అధికారులు పలుమార్లు విచారణ జరిపారు. ఆరోపణలు రుజువు కావడంతో ప్రస్తుతం ఎఓగా పనిచేస్తున్న రజినీచౌదరి, విఆర్వో శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. వీరిని ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎసిబి డిఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. అనేక ఆరోపణలు రాగా, వాటిపై విచారణ జరపగా, 18 ఆరోపణలు రుజువు అయ్యాయని, ఆ కేసుల్లో రజినీచౌదరితోపాటు శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు.