గుంటూరు

ఐకమత్యంతోనే సమస్యల సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంపట్నం, జూలై 24: గ్రామంలోని ప్రజలు కలిసి కట్టుగా ఉన్ననాడే ఏదైనా సాధించుకోవచ్చునని కోస్టర్ సెక్యూరిటి ఐజి జి సూర్యప్రకాశరావు అన్నారు. మండలంలోని బొర్రావారిపాలెం నూతనంగా నిర్మించిన శ్రీఅంకమ్మతల్లి నీటిశుద్ది కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఐజి మాట్లాడుతూ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు బొర్రావారిపాలెంలో నీటి యెద్దడి ఉందని తన దృష్టికి తీసుకురావటంతో ఎంతో బాధాకరంగా అనిపించి రాజుఎగేషన్ ఫౌండేషన్ వారితో మాట్లాడి వారి సహకారంతో వాటర్ ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు. స్వచ్చమైన నీరుప్రజలకు అందించటంలో ఫౌండేషన్ ముందుకు వస్తుందన్నారు. శంకరరావు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి కొరత ఎప్పటినుండో ఉందని ఐజి చొరవతో ఫౌండేషన్ సహకారంతో గ్రామంలోని ప్లాంటుకు స్థల దాత బొర్రా వీరభద్రయ్య, గ్రామ పెద్దల కృషితోనే నేడు మంచినీటి కొరత తీరిందన్నారు. ఈప్లాంటు సక్రమంగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరు మంచినీరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా పెద్దలు శంకరరావును సత్కరించారు.