విజయనగరం

పేదల గృహ నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 24: అధికారంలోకి వస్తే పేదలకు పక్కా గృహాలు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఈ రెండేళ్లల్లో అమలుకు నోచుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మజ్జిశ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు. పేదల గృహ నిర్మాణంపై దృష్టి పెట్టని ప్రభుత్వం పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎకరాల విస్తీర్ణం కేటాయించడానికి నిర్ణయం తీసుకోవడం శోచనీయమని అన్నారు. పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం తమకు అభ్యంతరం లేదని, నాలుగు ఎకరాల స్థలం పట్టణ ప్రాంతంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించాలనే నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇటువంటి భూపందేరం మంచిది కాదని అన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యక్రమాలకు, పేదల అవసరాలకు స్థల సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. పట్టణంలో సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలం లేక టెండర్ల దశలోనే ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గమనించి అధికారులు ఆచితూచి వ్యవహరించాలని కోరారు. నీరు-చెట్టులో చోటుచేసుకున్న అవినీతిపై విజిలెన్స్ విభాగానికి పూర్తి సమాచారం అందించామని చెప్పారు. నీరు-చెట్టు అక్రమాలపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణంలో రహదారుల అభివృద్థి పనులు నత్తనడకగా సాగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు శంకుస్థాపన చేసిన పనులు ఇంకా పూర్తిచేయలేకపోయారని ఆరోపించారు. గంటస్థంభం, పాతబస్‌స్టాండ్ రహదారి పనులు మినహాయిస్తే మిగిలిన పనులు కాగితాలపైనే ఉన్నాయని, ఎందుకు కాంట్రాక్టర్లు ముందు రావడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్ల విస్తరణకు సహకరిస్తామని, చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. వర్షాకాలంలో దోమల బెడద నివారించేందుకు ఫాగింగ్ చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పిళ్లా విజయకుమార్, కాళ్ల గౌరీశంకర్, యడ్ల పైడిరాజు పాల్గొన్నారు.