కరీంనగర్

హరీష్‌రావు కండ్లు తెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాలటౌన్, జూలై 25: మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికైన కండ్లు తెరవాలని సిఎల్‌పి ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి హితవు పలికారు. మెదక్ జిల్లా ప్రజలే నీకు రాజకీయ భిక్ష పెట్టిన విషయం గుర్తించు కోవాలన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూములు కోల్పోయిన వారికి ఎకరాకు 18లక్షలు చెల్లించాలని ఇండ్లకు, రెండింతలు, ఉపాధి, వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 123 జీవోను తెరపైకి తెచ్చి ఇరుపక్షాల అమోదం మేరకు అమ్మడం, కొనడం చేసి రైతుల అమాయకత్వాని ఆసరా చేసుకుని వ్యక్తిగత ప్రయోజనాలకు ఎరగా చూపి మార్కెట్ ధర ప్రకారం 6లక్షలు చెల్లిస్తామనడం అన్యాయమని ధ్వజమెత్తారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధరకు మూడింతలు ఎకరాకు 18లక్షలు చెల్లించాలన్నారు. ప్రభుత్వం మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల హక్కులను కాలరాస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను 40 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందించేందుకు రూప కల్పన చేసి పనులు కొనసాగించారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్ట్‌ల రీ-డిజైనింగ్ తెరపైకి తెచ్చి 60 టిఎంసిల నీటిని 40 వేల కోట్లకు లక్ష కోట్లకు పెంచి తమ్మిడిహట్టి సుందిళ్ల వరకు గ్రావిటి ద్వారా నీటిని తెస్తే మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతలకు అవసరం లేదని అన్నారు. నిర్మాణం వ్యయం పెరుగుతుందని, 16లక్షల ఎకరాలకు నాలుగు మాసాలు సరిపోయే నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని, చిన్న రిజర్వాయర్‌లతో ఎత్తిపోతలతో చేసుకోవచ్చన్నారు. మల్లన్న సాగర్ తెరపైకి తెచ్చారని, సాంకేతిక నిపుణులు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అవసరం లేదని సూచించినప్పటికి మొండిగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఒక వేళ నిర్మించాలని అనుకుంటే ముంపునకు గురి అయ్యే రైతులకు ఎకరాకు 18లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ భూసేకరణకు నోటిఫికెషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాచరికపు పాలనను తలపిస్తుందని, నిరసన వ్యక్తం చేసే రైతుల హక్కులను కాలరాస్తుందన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల ఆందోళన చేస్తే పోలీసులచే లాఠీచార్జీ, గాలిలో కాల్పులు జరిపి భయాందోళన గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు బండ శంకర్, నేతలు కొలుగూరి దామోదర్‌రావు, మండల పరషత్ ఉపాధ్యక్షుడు గంగం మహేష్, గర్వందుల నరేష్‌గౌడ్, గడ్డం ధశరథరెడ్డి, మారు గంగారెడ్డి పాల్గొన్నారు.