కరీంనగర్

అంత్యపుష్కరాలకు ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 25: ఈనెల 31 నుండి ఆగస్లు 11వరకు జరిగే గోదావరి అంత్యపుష్కరాలకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కె.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, మంథని తదితర పుష్కర ఘాట్ల వద్దకు బస్సులు నడుస్తాయని తెలిపారు. కరీంనగర్-్ధర్మపురి, జగిత్యాల-్ధర్మపురి, కోరుట్ల-్ధర్మపురి, మంథని-కాళేశ్వరం, కరీంనగర్-కాళేశ్వరం లకు 10 బస్సుల చొప్పున, మెట్‌పల్లి-్ధర్మపురి, గోదావరిఖని-కాళేశ్వరం, హుస్నాబాద్-్ధర్మపురి, హుజురాబాద్-్ధర్మపురి, సిరిసిల్ల-్ధర్మపురి, వేములవాడ-్ధర్మపురి, కరీంనగర్-కోటిలింగాలకు 5 చొప్పున ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన వివరించారు. ఈ రూట్లలో మొత్తం 85 బస్సుల ద్వారా 700 ట్రిప్పులను నడపనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బస్సులు నడుస్తాయని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కొత్త టెక్నాలజీతో ఏర్పాటుచేసిన గరుడ బస్సును కరీంనగర్ నుండి బెంగుళూరు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ ఎం తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చీఫ్ మేనేజర్ రవి, సూపరింటెండెంట్ జ్యోష్న, తదితరులు పాల్గొన్నారు.