రాష్ట్రీయం

ఎందుకంత తొందర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: వర్శిటీ వీసీల నియామకానికి సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే తెలంగాణలోని పలు వర్శిటీలకు వీసీలను నియమించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, న్యాయమూర్తి జస్టిస్ ఎవి శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వం తీరుపట్ల సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. వీసీల నియామకానికి ప్రస్తుతంవున్న నియమావళిని సవరిస్తూ ఏపీ యూనివర్సిటీల చట్టం-1991కి తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇప్పటి వరకు వర్శిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లనే వైస్-్ఛన్సలర్లుగా నియమించేవారు. అది కూడా గవర్నర్ ఆమోదం తీసుకున్న తర్వాతే నియామకాలు జరిగేవి. తెలంగాణ సర్కార్ చేసిన చట్ట సవరణ తర్వాత గవర్నర్ ప్రమేయం లేకుండా, విద్యార్హలతకు సంబంధం లేకుండా ఎవరినైనా వైస్ చాన్సలర్‌గా నియమించేందుకు వీలు కలిగింది. ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజాప్రతినిధులు... ఇలా ఎవరినైనా వీసీలుగా నియమించేందుకు వీలుగా చట్ట సవరణ చేశారు. ఈ చట్ట సవరణను సవాలు చేస్తూ ఉస్మానియా వర్శిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి మనోహర్‌రావు ప్రజాప్రయోజనాల వాజ్యాన్ని (పిల్)ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ వాజ్యంపై విచారణ కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో హైకోర్టు తీర్పు వెలువడుతుందని భావిస్తున్న సమయంలో సోమవారం ఏడు వర్శిటీలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ ప్రభుత్వం జీఓలను జారీ చేసింది. హైకోర్టు తీర్పు వెలువడే తరుణంలో ప్రభుత్వం వీసీల నియామకం చేస్తూ జీఓలు జారీ చేయడం సబబుకాదని డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమిస్తూ సోమవారం జారీ చేసిన జీఓలను హైకోర్టు దృష్టికి పిల్ వేసిన మనోహర్‌రావు తరఫు న్యాయవాది ఎస్ శ్రీరాం తీసుకెళ్లారు. దాంతో జస్టిస్ బోసలే స్పందిస్తూ పిల్ గత రెండేళ్ల నుంచీ విచారణ జరుగుతుంటే వేచివున్న ప్రభుత్వం, హైకోర్టు తీర్పు వెలువడే ముందు వీసీలను ఎందుకు నియమించాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని (ప్రభుత్వ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్) ప్రశ్నించారు. పిల్‌పై తీర్పు వచ్చే వరకు వీసీల నియామకం జరగదని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం మూడు రోజుల వరకు వీసీలను నియమించదని హైకోర్టుకు స్పష్టం చేశామని, మూడురోజుల గడవు ముగిసిపోవడంతో వీసీల నియామకం చేపట్టినట్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. హైకోర్టు మరొక పిటిషన్ విచారణ సందర్భంగా విశ్వవిద్యాలయాలకు వీసీలను వెంటనే నియమించాలంటూ ఆదేశించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం వీసీల నియామకం కూడా కోర్టు తీర్పునకు లోబడే ఉంటుందని వివరించారు.
విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రొఫెసర్లను మాత్రమే వీసీలుగా నియమించాలంటూ యూజిసి నియమావళి రూపొందించిందని, ప్రభుత్వం తాజాగా జారీచేసిన చట్ట సవరణ ప్రకారం పరిపాలనలో అనుభవం ఉన్నవారిని ఎవరినైనా వీసీలుగా నియమించే అవకాశం ఏర్పడింది. యూజిసి నియమావళిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని చర్చ వస్తోంది.
ఏడు వర్శిటీలకు వీసీల నియామకం
తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జెఎన్‌టియూ (హెచ్)కు ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డిని, తెలుగు వర్శిటీకి ప్రొఫెసర్ ఎస్‌వి సత్యనారాయణను, తెలంగాణ వర్శిటీకి ప్రొఫెసర్ పి సాంబయ్యను, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ కె సీతారామారావును, ఉస్మానియా వర్శిటీకి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్‌ను, కాకతీయ వర్శిటీకి ఆర్ సాయన్నను, పాలమూరు వర్శిటీకి ప్రొఫెసర్ బి రాజారత్నంను నియమించింది.