రాష్ట్రీయం

రాష్ట్రానికి శామ్‌సంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: తెలంగాణలో శామ్‌సంగ్ అకాడమీ ఏర్పాటు చేనున్నట్టు ఐటి మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ -శామ్‌సంగ్ ఆధ్వర్యంలో ఈ టైజన్ (అపరేటింగ్ సాఫ్ట్‌వేర్) అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అకాడమీ ద్వారా శామ్‌సంగ్ కోసం యాప్స్‌తోపాటు ఇతర సేవల యాప్స్ తయారు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే టైజాన్ సాఫ్ట్‌వేర్ మీద సుమారు 500మంది విద్యార్థులు, 75మంది ఫ్యాకల్టీ శిక్షణ కార్యక్రమం పూర్తయినట్టు తెలిపారు. ఇప్పటికే టాస్క్ తరఫున తయారు చేసిన యాప్స్‌లో 13 యాప్స్‌ను షార్ట్ లిస్ట చేసిన శామ్‌సంగ్ రిసెర్చ్ సంస్థ (బెంగళూరు) మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం టాస్క్ కార్యాలయంలో సోమవారం జరిగింది. తదుపరి శిక్షణను సంస్థ అందించనుంది. తాము తయారు చేసిన యాప్స్ గురించి విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా ఐటి మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ టాస్క్ ద్వారా ఇప్పటికే 40వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. విద్యార్థులను హైదరాబాద్ వచ్చి శిక్షణ తీసుకోమని చెప్పకుండా టాస్క్ ప్రతినిధులే జిల్లాలకు వెళ్లి శిక్షణ ఇవ్వడం ద్వారా టాస్క్‌ను మరింతగా విస్తరిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు టాస్క్‌ను మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఈ-టైజాన్ అకాడమీ ద్వారా శామ్‌సంగ్‌తో తెలంగాణ భాగస్వామ్యం మరింత ముందుకు వెళుతుందని కెటిఆర్ తెలిపారు. టి హబ్‌తో ఎంఓయు చేసుకున్నారు. పరిశోధనలకు ఊతం ఇస్తూ ఉద్యోగాలు కల్పించే వారి కోసం టి-హబ్ ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వెతుక్కునే వారికి సహయ పడేందుకు టాస్క్ ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. విద్యార్థులు మతం, సౌందర్యం, ప్రజాసేవ వంటి పలు రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు యాప్స్‌ను తయారు చేశారు. ఈ యాప్స్‌లో విద్యార్థుల నైపుణ్యం సీనియర్ శామ్‌సంగ్ ఉద్యోగుల స్థాయిలో ఉందని శామ్‌సంగ్ ఉపాధ్యక్షులు దీపక్ తెలిపారు. ప్రభుత్వ రంగంలోని సంస్థ ఇలా విద్యార్థులకు అన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని దీపక్ చెప్పారు. విద్యార్థుల్లో ఉత్సాహం, ప్రభుత్వ ప్రోత్సాహం చూసిన తర్వాత టైజాన్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. టాస్క్, టి-హబ్ ద్వారా చేసుకున్న ఎంఓయు ద్వారా మరింత నైపుణ్యం బయటకు వస్తుందని చెప్పారు. సమావేశంలో టాస్క్ సిఇఓ సుజీవ్ నాయర్, టి-హబ్ సిఇఓ శ్రీని కొల్లిపార, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఉన్నారు.

చిత్రం.. టాస్క్ కార్యాలయంలో శామ్‌సంగ్‌తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను మంత్రి కెటిఆర్ సమక్షంలో మార్చుకుంటున్న ప్రతినిధులు