రాష్ట్రీయం

మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఆగస్టు 7న రాష్ట్రానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కార్యక్రమాలు ఖరారయ్యాయి. ఈ మేరకు పిఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందింది. ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. సిఎం కెసిఆర్ నిర్వహించే సుదర్శన యాగాన్ని ప్రధాని సందర్శిస్తారు. తర్వాత వరంగల్‌లో ఏర్పాటు చేయబోయే కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అక్కడ వడ్డేపల్లి చెరువు గట్టుపై నిర్మించిన మిషన్ కాకతీయ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అలాగే రెండు వేల ఎకరాల్లో వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామగుండం వెళ్లి అక్కడ ఎన్‌టిపిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 1600 మెగావాట్ల విద్యుత్కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా జైపూర్ సింగరేణి ఆధ్వర్యంలో స్థాపించిన విద్యుత్కేంద్రాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అయితే ప్రధాన మంత్రికి సమయం ఉంటేనే జైపూర్ విద్యుత్కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారని, సమయం లేనిపక్షంలో కార్యక్రమం రద్దయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ప్రధాని తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.