కృష్ణ

పోర్టు భూముల సమీకరణకు నేడు నోటిఫికేషన్ ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 25: బందరు ఓడరేవు నిర్మాణానికి, పరిశ్రమల స్థాపనకు గత రెండు రోజుల క్రితం ల్యాండ్ పూలింగ్ జివో విడుదల చేసిన ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన 4వేల 636 ఎకరాల భూముల సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. చిలకలపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, తపసిపూడి, పోతేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 4వేల 636 ఎకరాలను సమీకరించేందుకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత భూములకు సంబంధించిన సర్వే నెంబర్ల పరిశీలన చేపట్టారు. బందరు మండలంలోని రెవెన్యూ సిబ్బంది ఈ పరిశీలనలో పాల్గొన్నారు. సంబంధిత భూముల సర్వే నెంబర్ల వివరాలలను విజయవాడలో ఉన్న మడ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడుకు అందచేశారు. పోర్టు నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం గుర్తించిన 4వేల 636 ఎకరాల్లో 2వేల 282 ఎకరాలు పట్టా భూమి, 413 ఎకరాలు అసైన్డ్ భూమి, 1,954 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. పోర్టు, పరిశ్రమల స్థాపనకు 14వేల ఎకరాల పట్టా భూములకు నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నప్పటికీ భూసమీకరణ నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) సంస్థకు పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడం వల్ల తొలి విడతగా కేవలం బందరు పోర్టు నిమిత్తం గుర్తించిన 4వేల 636 ఎకరాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.