కృష్ణ

పుష్కర భక్తులకు పూర్తి భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 26: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ఏమాత్రం ముప్పు రాకుండా రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఏలూరు రేంజ్ పరిధిలోని కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర ఘాట్లు, పుష్కర నగర్‌ల వద్ద తీసుకోవల్సిన జాగ్రత్తలు, బందోబస్తుపై సూచనలు చేశారు. పుష్కర విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది సంబంధిత ఘాట్లు, పుష్కర నగర్‌లపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. అత్యధికంగా భక్తుల తాకిడి ఉండే వేదాద్రి, హంసలదీవి, ముత్యం, పెద్దకళ్ళేపల్లి ఘాట్ల వద్ద ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముత్యాల, వేదాద్రి ఘాట్లు తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావటంతో ఆ రాష్ట్ర ప్రజలు కూడా పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్, బారికేడ్లు, సిసి కెమెరాలు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలను ముందుగా పరిశీలించి సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ వాటి పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుంటూ ఉండాలన్నారు. బందోబస్తుకు వచ్చే సిబ్బందికి అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామన్నారు. పుష్కర ఘాట్ల విశిష్ఠత, అక్కడి లోతు వివరాలను తెలియజేస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. బారికేడ్ల నుండి ఒకేసారి గుంపులుగా కాకుండా విడతల వారీగా భక్తులను పుష్కర స్నానాలకు అనుమతించాలన్నారు. 100 మందికి సరిపోయే బారికేడ్లలో 70 మందిని మాత్రమే పంపేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లోపలకు, వెలుపలకు వెళ్లే మార్గాలను విడివిడిగా ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రాంతాలను, పుష్కరాలకు వచ్చే ప్రతి ఒక్కరినీ కవర్ చేసేలా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఘాట్ వద్ద గజ ఈతగాళ్ళు, పడవలు, లైఫ్‌జాకెట్లను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. అనుక్షణం గజ ఈతగాళ్ళు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాచ్‌టవర్స్, సిసి కెమెరాల ద్వారా పుష్కర ఘాట్ల రద్దీని గుర్తించి కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని డిఐజి రామకృష్ణ శర్మ వివరించారు. ఈ సమావేశంలో కృష్ణా, ఏలూరు, కాకినాడ అదనపు ఎస్పీలు బివిడి సాగర్, చంద్రశేఖర్, ఎస్‌పి రవిశంకర్ రెడ్డి, బందరు డిఎస్పీ సూర్య శ్రావణ్ కుమార్, రాజమండ్రి మహిళా పిఎస్ డిఎస్పీ భరత్ మాతాజీ, కాకినాడ ఎస్‌సి ఎస్‌టి సెల్ డిఎస్పీ మురళీమోహన్, కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీ కెవి సూర్యనారాయణ, కాకినాడ మహిళా పిఎస్ డిఎస్పీ వి విజయరావు, తిరుపతి ట్రాఫిక్ డిఎస్పీ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.