విజయనగరం

కృష్ణా పుష్కరాలకు 150 ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 26: వచ్చేనెల 12 నుంచి 23వతేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు ఉత్తరాంధ్ర నుంచి 150 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించామని ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని అన్ని డిపోల నుంచి ప్రతీరోజూ 200 ట్రిప్పులు తిప్పుతామని, దీనికి అన్ని ఏర్పాట్లు ఇప్పటినుంచే చేస్తున్నామన్నారు. మంగళవారం ఇక్కడ ఆర్‌ఎం కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా నుంచి 50, శ్రీకాకుళం జిల్లా నుంచి 50, విశాఖ జిల్లా నుంచి 50 బస్సులు నడుపుతామని చెప్పారు. వీటితోపాటు 50 రెగ్యులర్ బస్సులు యథావిథిగా తిరుగుతాయని అన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. వచ్చేనెల 11వ తేదీ సాయంత్రం నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. ఆయా డిపో బస్‌స్టేషన్‌ల నుంచి బయలుదేరే ప్రత్యేక బస్సులను విజయవాడ లోని ‘నున్న’ ప్రాంతంలో ఉన్న వైవిరావు ఎస్టేట్స్ వరకు నడుపుతామని చెప్పారు. అక్కడ నుంచి పలు ఘాట్‌లకు ఉచిత సిటీ బస్సులను నడుపుతామన్నారు. ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని పవిత్ర పుష్కర స్నానమాచరించి కృష్ణవేణి నదీమాత దివ్య ఆశీస్సులు పొందాలన్నారు. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాల ప్రత్యేక బస్సుల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అదేవిధంగా ఈనెల 31 నుంచి వచ్చేనెల 11వతేదీ వరకు జరిగే గోదావరి అంత్యపుష్కరాలకు మూడు జిల్లాల నుంచి 150 ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం అప్పన్న, డిప్యూటీ సిటిఎం వరప్రసాద్, పర్సనల్ అధికారి సన్యాసిరావు, డిపోమేనేజర్ పద్మావతి, కమర్షియల్ మేనేజర్ రమేష్, రీజనల్ కంప్యూటర్ కోర్‌గ్రూపు నిపుణుడు ఎంఎస్‌పిరావు, ఆర్‌ఎం కార్యాలయం అసిస్టెంట్‌మేనేజర్ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.