గుంటూరు

అభివృద్ధి పేరిట ఎనె్నన్నో అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జూలై 26: అభివృద్ధి పేరిట ఎనె్నన్నో అక్రమాలకు పాల్పడవచ్చని రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం తన చర్యల ద్వారా లోకానికి చాటిచెప్తోందని మాజీ మంత్రి, వైసిపి నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. మంగళవారం బాపట్లలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివెళ్తున్న ధర్మాన బృందం మార్గమధ్యలో పొన్నూరులోని వైసిపి నేత ఆకుల వెంకటేశ్వరరావు నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని, ఇదేం అన్యాయమని ప్రశ్నించే రాజకీయపక్షాలు, ప్రజాప్రతినిధులపై అభివృద్ధి నిరోధక శక్తులుగా ముద్రవేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఆర్భాటంగా అదిచేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నప్పటికీ పనులు అభివృద్ధికి దోహద పడటం లేదన్నారు. పైగా ప్రజా వ్యవస్థ కుప్పకూలుతుందని ధర్మాన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే అధికార పార్టీ రూలింగ్ బాగుంటుందన్న వాస్తవాన్ని మరచి అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. విలేఖర్ల సమావేశంలో ఉరవకొండ శాసనసభ్యుడు యు విశే్వశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, వైసిపి నేత ఆకుల వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు ఎస్‌కె నయింబాషా, మాణిక్యరావు, శివనాగరాజు, తజ్ముల్‌బేగ్, అల్లం సాంబయ్య, వాహెదుల్లా, సుల్తాన్, మొల్లా కరీమ్, బి రంగారావు పాల్గొన్నారు.