తెలంగాణ

కంగుతిన్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 26: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జిని నిరసిస్తూ కదం తొక్కాలనుకున్న కాంగ్రెస్ వ్యూహాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లన్న సాగర్‌కు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యూహం విఫలమైంది. పార్టీ నేతలు, శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం గాంధీభవన్ నుంచి ముఖ్య నేతల అధ్వర్యంలో భారీ ర్యాలీగా మల్లన్న సాగర్‌కు వెళ్ళాలని నేతలు భావించారు. సుమారు 200 వాహనాలకు తగ్గకుండా ర్యాలీగా చేరుకోవాలని అనుకున్నారు. ముఖ్య నేతలంతా ఒకే బస్సులో బయలుదేరేందుకు సమాయత్తమయ్యారు. ఈమేరకు ఉదయం 9.30కే సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఇతర నేతలు కొనగాల మహేశ్, బొల్లు కిషన్ తదితరులు గాంధీ భవన్‌కు చేరుకున్నారు. టిపిసిసి ఆదేశం మేరకు జిల్లాల నుంచీ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గాంధీ భవన్‌కు చేరుకున్నారు. కాగా దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిలువరించాలని పోలీసులు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు గాంధీభవన్ ప్రధాన ద్వారం దాటి బయటకు రాకుండా నిరోధించేందుకు పోలీసులు ప్రయత్నించారు. చాలాసేపు పోలీసులతో నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. తాము ఆందోళన చేసేందకు వెళ్ళడం లేదని, శాంతియుతంగా మల్లన్నసాగర్‌కు వెళ్ళి రైతులను కలుసుకుంటామని నేతలు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. కొద్దిసేపు తోపులాటలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయినా కొంతమంది నాయకులు తోసుకుని నాంపల్లి చౌరస్తా వరకూ వెళ్ళగిలిగారు. కానీ అక్కడా వారికి చుక్కెదురైంది. భారీగా మోహరించిన పోలీసులు అడ్డగించి బలవంతంగా అరెస్టు చేశారు. మల్లు భట్టివిక్రమార్కను అరెస్టు చేసి నారాయణగుడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి), బొల్లు కిషన్ తదితరులను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ దశలో జగ్గారెడ్డి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్వాల్ నుంచి గాంధీభవన్ చేరుకుంటున్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ ప్రభృతులు మల్లన్న సాగర్‌కు ఇంకో 10 కిలోమీటర్ల దూరంలో చేరుకోనుండగా గజ్వేల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ వైఖరిని నిరసిస్తూ వారు కొంతసేపు రోడ్డుపై బైఠాయించారు. టిపిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను మెదక్ జిల్లా కొండపాక మండలం కుక్కునూరిపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేసి నల్లగొండ జిల్లా తుర్కపల్లి గ్రామానికి తరలించారు. కరీంనగర్ జిల్లా నుంచి బయలుదేరిన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి డి శ్రీ్ధర్ బాబును అక్కడే స్థానిక పోలీసులు నిర్భంధించారు. ఇలా వివిధ జిల్లాల నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. దీంతో కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టింది.
ఇంత నిర్భంధమా?: జైపాల్‌రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్ళాలనుకున్న తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఎందుకు నిర్భంధించారని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌పై ప్రభుత్వ విధానం అప్రజాస్వామికంగా ఉందన్నారు. 50 టిఎంసితో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మవిశ్వాసం కోల్పోయిందన్నారు.
జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అరెస్టులకు అదిరేది లేదన్నారు. బాధితులను పరామర్శించడం తప్పాని నిలదీశారు. ఇతర పార్టీలను అస్థిరపర్చడం సరైన పద్ధతి కాదని సర్కారుకు హితవుపలికారు. మల్లన్న సాగర్ రైతుల అనుమానాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని జానారెడ్డి విమర్శించారు.
chitram...
గాంధీభవన్ నుంచి బయటకు రాకుండా మల్లు భట్టివిక్రమార్కను అడ్డుకుంటున్న పోలీసులు