మహబూబ్‌నగర్

పుష్కరాలను వైభవంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటిక్యాల, జూలై 26: ఆగస్టు నెలలో జరిగే కృష్ణాపుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న బీచుపల్లి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న పుష్కరఘాట్ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదిలోపు పుష్కరఘాట్ పనులను పూర్తి చేయాలని సంబంధితశాఖల అధికారులకు ఆదేశించడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులను కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా నిర్వహిస్తున్న కృష్ణ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు పుష్కరఘాట్లను సందర్శిస్తున్నట్లు వారు తెలిపారు. పిండప్రధాన భవనం, ఆలయాలను రంగులతో తీర్చిదిద్దాలని అధికారులకు తెలియజెప్పారు. అనంతరం బీచుపల్లి ఆలయ ప్రాంగణం నుంచి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వలబాలరాజు, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపి మంద జగన్నాథం, టిఆర్‌ఎస్ అలంపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మంద శ్రీనాథ్, గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీటిసి ఖగ్‌నాథ్‌రెడ్డి, గద్వాల ఎంపిపి సుభాన్, డిఎస్‌పి బాలకోటి, అలంపూర్ సిఐ వెంకటేశ్వర్లుతోపాటు ఆయాశాఖల అధికారులు ఉన్నారు.