మహబూబ్‌నగర్

పేదరిక నిర్మూలనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, జూలై 27: రాష్ట్రంలో పేదరికాన్ని అంతమొందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. బుధవారం కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామ పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఎస్సీలకు పంపిణీ చేసిన పొలంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితులకు ప్రభుత్వం మూడు ఎకరాల పొలాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల రెండు వందల లబ్ద్ధిదారులను ఎంపిక చేసి 10వేల ఎకరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలోని భూస్వాముల నుండి ప్రభుత్వం భూములను కొనుగోలు చేసి లబ్ద్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 30వేల మందికి 120కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగిందని, ఈ డబ్బులను లబ్ద్ధిదారుల ఖాతాలకు 10రోజుల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలను లక్షాధికారి చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30న రంగారెడ్డి జిల్లా సాతన్‌రాయ్‌లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అన్ని దళిత సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి సర్వయ్య, గ్రామ సర్పంచ్ యాదమ్మ, ఎంపిడివో యాదయ్య, తహశీల్దార్ పాండు, ఎపిఓ నర్సింగ్‌రావు, నాయకులు శ్రీ్ధర్‌రెడ్డి, మంగులాల్‌నాయక్, జాంగారి రవి, గోపాల్‌రెడ్డి, రాములు, రామకృష్ణ, గోవింద్‌తోపాటు రైతులు పాల్గొన్నారు.