మహబూబ్‌నగర్

5.50లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 27: హరితహారంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని 64మండలాల్లో 5.50లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవీ వివరించారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామ సమీపంలో రైతు క్షేత్రంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీదేవీ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహార కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్దతిలో రైతులు కూరగాయల పంటలను సాగుచేస్తే అధిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఎన్నో నూతన పద్దతులు వచ్చాయని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలను సాగుచేస్తే నీరు వృధా కాకుండా పంటలు సక్రమంగా పండే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా జిల్లాలోని 64మండలాలకు 80కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. 95శాతం సబ్సిడితో ఎస్సీ, ఎస్టి రైతులకు ఫాలీహౌస్‌లు ఇస్తున్నట్లు, మిగతా ఐదు శాతం రుణం చెల్లించి నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు లాభాల బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఆనంతరం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి విధానం అవలంభిస్తేనే దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని అన్నారు. ప్రతి పంచాయతీలో 40వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో నాగులపల్లి సర్పంచ్ రంగయ్య, టిఆర్‌ఎస్ నేతలు లింగారం పెంటయ్య, నరేందర్, జి.వెంకట్‌రెడ్డి, ఎంఎస్ నటరాజ్, వెంకట్‌రాంరెడ్డి, జాంగారి నర్సింలు, యుగంధర్, బచ్చలి నర్సింలు, బంగ్లకాడి శ్రీను పాల్గొన్నారు.