మహబూబ్‌నగర్

ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా బిజెపి రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జూలై 27: ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి వైఖరికి నిరసనగా బుధవారం మక్తల్‌లోని అంతరాష్ట్ర రహదారిపై బిజెపి శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాస్తారోకో కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య మాట్లాడుతూ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నప్పుడు ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఎంపిపిని ఎందుకు పిలువలేదని తమ నాయకుడు కోళ్ల వెంకటేష్ సిఇని ప్రశ్నిస్తే కొట్టారన్న సాకుతో 5మందిపై ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి కేసులు బనాయింపచేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. సిఇ రాజీ పడానికి ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యే రెచ్చకొట్టే ప్రయత్నం చేశాడని అన్నారు. స్థానిక సంస్థలను ఎమ్మెల్యే నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్న మహిళా సమాఖ్య బిల్డింగ్ ప్రారంభంలో జెడ్పిటిసి, ఎంపిటిసిల పేర్లు పెట్టకుండా తమ ఇష్టానుసారంగా ఎమ్మెల్యే చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే తమ పద్దతులను మార్చుకోకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎంపిపి కోళ్ల పద్మమ్మ, సోమశేఖర్‌గౌడ్, విద్యాసాగర్, నాగప్ప, రాంలింగం, నరేందర్‌సాగర్, మోహన్‌గౌడ్, లక్ష్మయ్యలతోపాటు వందలాది మంది బిజెపి శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను తగులపెట్టడానికి బిజెపి శ్రేణులు ప్రయత్నిస్తుంటే సిఆర్‌పి దళాలతోపాటు, స్థానిక పోలీసులు సైతం అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. చివరికి బిజెపి శ్రేణులు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి సగం దిష్టిబొమ్మను తగులపెట్టారు. పోలీసులకు బిజెపి శ్రేణులకు తోపులాట జరుగడంతో పరిస్థితి కొంత ఉదృతంగా మారింది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వారిపై చేయిచేసుకున్న కోళ్ల వెంకటేష్‌తోపాటు మరో నలుగురు నీలారెడ్డి, కావలి శ్రీహరి, మహిపాల్‌రెడ్డి, తిరుపతి నర్సిములను బుధవారం ఆరెస్టుచేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై మురళీగౌడ్ తెలిపారు.