కరీంనగర్

మధ్య మానేరు పూర్తిచేసి మల్లన్నసాగర్ నింపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోయినపల్లి, జూలై 28: మధ్యమానేరు జలాశయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఇందులో నీటితో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నింపుతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. గురువారం మండలంలోని మానువాడ వద్ద నిర్మిస్తున్న మధ్యమానేరు జలాశయం స్పిల్‌వే నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మధ్యమానేరు నిర్మాణపు పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలో పూర్తి చేస్తుందన్నారు. ఈ జలాశయం పూర్తయితే ఇక్కడ నిలువ ఉంచిన నీటితో మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్‌కు తరలిస్తామన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతుండడంతో మధ్యమానేరు జలాశయంలో నీటిని నిలువ చేయడానికి పనులు ఎలా ఉన్నాయో పరిశీలించడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ వర్షాకాలంలో 3 టిఎంసిల నీటిని నిలువ చేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానువాడ సర్పంచ్ రామిడి శ్రీనివాస్, మధ్యమానేర్ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.