కరీంనగర్

భయం గుప్పిట్లో కుక్కలగుడూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూలై 28: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి రోజు రోజుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో నీటి మట్టం విపరీతంగా పెరిగిపోతూ ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయ. గురువారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో పాక్షికంగా ముంపునకు గురైన రామగుండం మండలంలోని కుక్కలగుడూర్ గ్రామ శివారు ప్రాంతాల్లోకి ప్రాజెక్ట్ నీరు చొచ్చుక రావడంతో గ్రామస్థులు జంకుతున్నారు. ఏక్షణాన ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనని.. ప్రాజెక్ట్‌లో నీటి మట్టం మరింతగా పెరిగితే గృహాలన్ని జల దిగ్బంధం అవుతుందని కుక్కలగుడూర్ గ్రామస్థులు జాగరణ చేస్తున్నారు. కంటిపై కునుకు లేకుండా కళ్లకు వత్తులు వేసుకొని గడుపుతున్నారు. ప్రస్తుతం శ్రీపాద ప్రాజెక్ట్‌లో 145.65 లెవల్ వరకు నీటి మట్టం ఉండగా ప్రాజెక్ట్‌లో 14.5 టిఎంసిల నీరు నిల్వ ఉంది. కుక్కల గుడూర్ గ్రామ శివారులోనే బండల వాగు ఉంది. ఈ వాగులో వరద నీరు ఎక్కువైనప్పుడు తలాపున ఉన్న గోదావరి నదిలో ప్రవహిస్తుంటుంది. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో రెండు రోజులుగా విపరీతమైన వరద ఉధృతి కారణంగా ప్రాజెక్ట్‌లో నీటి సామర్థ్యం పెరిగి రివర్స్ ద్వారా వరద నీరంతా బండల వాగులోకి ప్రవహించడంతో సమీపంలోని గృహాల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణాన ప్రాజెక్ట్‌లో నీటి మట్టం మరింతగా పెరిగి ఇండ్లలోకి చొచ్చుక వస్తే తమ బతుకుల పరిస్థితి ఏందని జంకుతున్నారు. ఊరును పాక్షికంగా తీసుకోవడం మాని మొత్తంగా ముంపుకు గురి చేయాలని సంవత్సరాలుగా మొత్తుకుంటున్న ఒక్కరూ పట్టించుకోవడం లేదని, ప్రాజెక్ట్‌లో నీటి మట్టం పెరిగితే తమ బతుకుల గతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.