కరీంనగర్

గ్రామ మార్పు ‘సాగీ’ లక్ష్యం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, జూలై 28: గ్రామంలోని ప్రజల అవసరాలను గుర్తించి సమకూర్చడంతో పాటు మార్పు చెందేలా చూడడమే సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన ‘సాగీ’ లక్ష్యమని సాగీ డైరెక్టర్ డాక్టర్ కుశాల్ పథక్ అన్నారు. కరీంనగర్ ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్ దత్తత గ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లిలో మంత్రి కెటిఆర్, ఎంపి వినోద్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్‌లతో కలిసి ఆయన గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, రైతు సమాచార కేంద్రం, తెలంగాణ గ్రామీణ బ్యాంకులను సందర్శించారు. సారా మానేసి ప్రభుత్వ సహాయంతోఉపాధి పొందుతున్న నాలుగు కుటుంబాల స్థితిగతులు, మరుగుదొడ్ల నిర్మాణం నిధులు, వినియోగం, పరిశుభ్రతను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో తమకు సేవలు అందిస్తున్నారని పేర్కొనడంతో సంతృప్తి చెందారు. అంగన్‌వాడీ చిన్నారులు, విద్యార్థుల బోధన విధానం, అమలుపై ఆరా తీశారు. ఆంగ్ల మాధ్యమ విద్యను అందిస్తున్నామని ఉపాద్యాయులు చెప్పడంతో ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రవేటు పాఠశాలల దాటికి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని ఆంగ్లమాధ్యమ విద్యను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనర్గళంగా చెప్పడంతో అభినందించారు. అనంతరం కుశాల్ పథక్ మాట్లాడుతూ ప్రతి ఎంపి ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2014లో సంసద్ ఆదర్శ గ్రామ యోజనను ప్రవేశ పెట్టారని అన్నారు. 2019 వరకు అభివృద్ధి చేయడంతో పాటు ఆదర్శ గ్రామంగా నిలుపాలని కోరినట్లు చెప్పారు. భారత దేశంలో మొదటి విడతలో 705 గ్రామాలను ఎంపిలు దత్తత తీసుకున్నారని అన్నారు. అభివృద్ధిలో ముందున్న 55 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నేతృత్వంలో అధికారుల బృందాన్ని ప్రగతి నివేదికల ఆధారంగా క్షేత్ర స్థాయిలో పరిశీలనకు పంపిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము 25 గ్రామాలను పరిశీలించామని అన్నారు. 95 శాతం పూర్తయ్యాయని వీర్నపల్లి ఏ కేటగిరిలోకి వస్తుందని అన్నారు. దేశంలో వీర్నపల్లి 18 స్థానం, తెలంగాణలో మొదటి స్థానంలో ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 15 పథకాలను ప్రవేశ పెడితే కేంద్ర ప్రభుత్వం 223 సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. అవగాహన లేకపోవడంతో ప్రజలు వినియోగించుకోడం లేదని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వివరించి వారి దరిచేరేలా చొరవ తీసుకోవాలన్నారు. 5 శాతం పూర్తయితే వీర్నపల్లి ఏ ప్లస్ కేటగిరిలోకి వస్తుందని అన్నారు. జాతీయ స్థాయిలో వీర్నపల్లికి గుర్తింపు లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో తాము పరిశీలించిన నివేదికలను కేంద్ర మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమర్పంచనున్నామని డైరెక్టర్ కుశాల్ పథక్ పేర్కొన్నారు. ఢిల్లీ బృందం అధికారులు సతీష్ రంజిత్ సింహా, అమిత్‌జైన్, పిడిలు వెంకటేశ్వర్‌రావు, రమేశ్, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, అధికారులు పాల్గొన్నారు.