విజయనగరం

మావోల వారోత్సవాల మధ్య గ్రామ సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, జూలై 28: మావోయిస్టుల వారోత్సవాల మధ్య గ్రామ సందర్శన గురువారం నిర్వహించారు. మండలంలోని నంద గ్రామంలో పోలీసు, సిఆర్‌పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య మండల ప్రత్యేకాధికారి ఆర్.మురళీధర్ గ్రామ సందర్శన నిర్వహించారు. మావోయిస్టులు ఈ నెల 28 నుంచి వచ్చేనెల 3వతేదీ వరకు వారోత్సవాలను జరుపుతుండడంతో కొన్ని ఏజెన్సీ మండలాల్లో అధికారులు గ్రామసభలు రద్దుచేశారు. అయినప్పటికీ నంద గ్రామంలో యథావిథిగా గ్రామ సందర్శన జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను చెప్పాలని సర్పంచ్, మాజీ సర్పంచ్ అప్పలస్వామిలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంచినీటి సదుపాయం సక్రమంగా లేదన్నారు. పాఠశాల భవనం శిధిలావస్థకు చేరుకొని వర్షానికి కారిపోతుందని తెలిపారు. గిరిజనులు నిత్యవసర సరుకుల నిమిత్తం సుమారు 10 లక్షల నిర్మాణం చేపట్టిన గిరిజన కార్పోరేషన్ భవనం ప్రారంభం కాకముందే వర్షానికి కారిపోతుందని తెలిపారు. గ్రామంలో ఎన్టీఆర్ జలసిరి కింద ఉపాధిహామీ ద్వారా ఏర్పాటుచేసిన వ్యవసాయ బోర్లకు బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. గ్రామానికి మార్కొండపుట్టి మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్‌ను, పాఠశాల, వైద్య శిబిరం తదితర వాటిని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కెవి.రామారావు, ఎంపిడిఒ జి.రామారావు, వ్యవసాయాధికారి తిరుపతిరావు, పంచాయతీరాజ్ జెఇ రత్నం, ఐసిడిఎస్ సిడిపిఒ ఉమాభారతి, ఎంఇఒ మళ్లీశ్వరరావు, వెలుగు ఎసి చిరంజీవి పాల్గొన్నారు.