విజయనగరం

అన్ని మున్సిపాలిటీలను ఒడిఎఫ్ ప్రాంతాలుగా మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం జూలై 28: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీల్లో మొదటి విడతగా ఎన్టీఆర్ క్యాంటీన్లను ఏర్పాటుకు నిర్ణయించామని చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల విషయంలో కోర్టులో కేసు ఉన్న కారణంగా ఎన్నికలు నిర్వహించలేదని చెబుతూ కోర్టు తీర్పు అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గురువారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో చేపట్టిన కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ నాటికి అన్ని మున్సిపాలిటీలలో ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీల పరిధిలోని అన్ని వార్డులకు మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. మున్సిపాలిటీల సుందరీకరణ పనులలో భాగంగా రోడ్ల వెడల్పుతోపాటు ఫుట్‌పాత్‌లు, డివైడర్‌ల ఏర్పాటు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలకు మంజూరైన గృహనిర్మాణాలను పిపిపి పద్ధతిలో చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలకు అన్ని బిల్లులు ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాలని ఆదేశించారు. కుక్కలు, పందుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను తరచూ పర్యవేక్షించాలని చెప్పారు. ఈసమావేశంలో కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ వాటర్‌ట్యాంకుల కోసం 30 లక్షలు, వౌళిక సదుపాయాలకు 2.90కోట్లు, కమ్యూనిటీ భవానాలు, టాయ్‌లెట్ల ఏర్పాటుకు 80లక్షల రూపాయలు, మున్సిపల్ కొత్త భవనాల నిర్మాణానికి రెండుకోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో 6.75కోట్ల రూపాయలతో 62 అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు. అక్టోబర్ రెండు నాటికి జిల్లాలోని చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాలను ఒడిఎఫ్ నియోజకవర్గాలుగా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.