ప్రకాశం

మున్సిపాలిటీల్లో అభివృద్ధి పథకాల అమలు వేగవంతంచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 28: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలుచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుండి ముఖ్యమంత్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు జరగని 11 మున్సిపాలిటీల్లో అమృత పథకం కింద 1640 కోట్ల రూపాయలతో మంజూరు అయిన 3680 పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అమృత పథకం కింద మంజూరు చేసిన పనుల ఎస్టిమేట్స్, టెండర్లు పిలువటం వంటి కార్యక్రమాలు 15 రోజుల్లో పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి కార్యక్రమాలు పారదర్శకంగా చేపట్టాలన్నారు. అన్ని మున్సిపాలిటీ పార్కుల్లో, కార్యాలయాల్లో, వాణిజ్య సంస్థల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. ఈ నెల 29న జరుగబోయే వనం-మనం కార్యక్రమంలో పది లక్షల మొక్కలు నాటాలని ఆదేశించారు. దీపం పథకం కింద అర్హులైన వారికి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలని సూచించారు. మున్సిపాలిటీల్లో ఇంటి నివేశన స్థలాల కోసం, పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. 11 మున్సిపాలిటీల్లో ప్రారంభించిన పనులకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల అభివృద్ధిపై సమీక్షిస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో జరిగిన పనులను తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు నుండి ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.