గుంటూరు

వనం -మనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడికొండూరు, జూలై 29: రాష్ట్రంలో 2029 నాటికి 50 శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన వనం- మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని పేరేచర్ల అటవీ ప్రాంతంలో మంత్రి రావెల, కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ హరితాంధ్రప్రదేశ్ నిర్మాణ లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉద్యమ స్థాయిలో భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జపాన్ దేశంలో 65 శాతం భూభాగం పచ్చదనంతో నిండి ఉంటుందని, మన దేశంలో కేవలం 23 శాతం మాత్రమే ఉందని గుర్తుచేశారు. ముఖ్యంగా మానవుల మనుగడకు చెట్టు ఎంత అవసరమో గుర్తించి విద్యార్థి దశ నుంచి మొక్కలునాటి వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలని మంత్రి విద్యార్థులకు ఉద్బోధించారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై ఉందన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ మానవుల మనుగడ చెట్లతో ముడిపడి ఉందనే వాస్తవాన్ని గుర్తించి ప్రభుత్వం చేపట్టిన వనం- మనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. 50 శాతం పచ్చదనం సాధించడం కోసం ప్రతి ఏటా 4 లక్షల హెక్టార్ల భూమిలో మొక్కలు నాటాలనే లక్ష్యాలను నిర్దేశించినట్లు చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ వనం- మనం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతాన్ని నగర వనంగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. జాతీయ అటవీ విధానం ప్రకారం మూడోవంతు భూ భాగంలో చెట్లు ఉండాలని, రాష్ట్రంలో 21.22 శాతం ఉండగా జిల్లాలో కేవలం 14.58 శాతం మాత్రమే ఉందన్నారు. ఇందుకు అదనంగా మరో 19 శాతం భూమిని వనాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రభుత్వం వనం-మనం కార్యక్రమంతో కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్రంలో అడవుల శాతం తగ్గిపోయిందని, సామాజిక వనాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కల పెంపకం ఆవశ్యకతపై నిర్వహించిన వక్తృత్వ పోటీలలో మొదటి బహుమతి సాధించిన ఎర్రబాలెం పాఠశాల విద్యార్థి వి అక్షయ్, గుంటూరుకు చెందిన మరో విద్యార్థి శివకుమార్‌కు, తెనాలి ఎంపీఆర్ పాఠశాలకు చెందిన వెంకటేష్‌కు మంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కన్సర్వేటర్ రత్నాకర్ జవహర్, ప్రసాదరెడ్డి, సామాజిక వన విభాగం డీఎఫ్ ఓ రామ్మోహనరావు, డ్వామా పిడి శ్రీనివాసరావు, ఆర్డీవో శ్రీనివాసులు, డీవో శ్రీనివాసులురెడ్డి, జడ్పీటీసీ గుంటుపల్లి సాంబశివరావు, ఎంపీడీఓ సుబ్బారావు, రూరల్ ఎంపీపీ రత్నకుమారి పాల్గొన్నారు.