ఆంధ్రప్రదేశ్‌

అర్చకులకు బయోమెట్రిక్ విధానం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూలై 30: దేవాలయాల్లోని అర్చకులు, పురోహితులుగా విధులు నిర్వహిస్తున్న వారికి బయోమెట్రిక్ విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత బ్రాహ్మణ సంఘ సమాఖ్య పేర్కొంది. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు జోలాపురపు శ్రీకాంత్, జాతీయ కార్యదర్శి ఎంఎల్‌ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేదరికం, ప్రతిభ ఆధారంగానే రిజర్వేషన్‌లు అమలు జరగాలే తప్పా కులాల ప్రాతిపదికన కాకూడదన్నారు. రాజస్థాన్, గుజరాత్ తరహాలో ఓసీల్లో పేదలకు 19 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు భగవంతుడి సేవలకు అంకితమయ్యే అర్చకులకు బయో మెట్రిక్ హాజరు హాజరు విధానం సరికాదన్నారు. కృష్ణా పుష్కరాలలో పితృ కర్మలు నిర్వహించే బ్రాహ్మణులకు ధర నిర్ణయించడాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ కమిషనర్‌ను కలిసి తమ అభ్యంతరాలను లేఖ ద్వారా తెలియజేస్తామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ సేవలపై అవగహన లేకపోవడంతో పేద బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. విద్యాభారతి, చాణక్య, వశిష్ట, గరుడ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అవగహన కల్పించి బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకునేలా ప్రణాలికలు సిద్ధం చేస్తున్నామన్నారు.